2019 కి విజయవంతముగా వీడ్కోలు పలికి... ఎన్నో ఆశలు ఆశయాలతో 2020 వ సంవత్సరానికి స్వాగతం పలికింది ప్రపంచం.  ఈ విశ్వంలో జీవించే జంతువులలో మనిషి తెలివైన వ్యక్తి.  అందుకే భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.  మనిషికి ఎన్నో కోరికలు, ఆశయాలు ఉంటాయి.  వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు.  మనుషులు బేసిగ్గా మంచోళ్ళు.  అందులో సందేహం అవసరం లేదు.

 
ఎందుకంటే స్పందించే గుణం ఉంటుంది.  అలా స్పందించే గుణం లేకుంటే మనిషి మనుగడ సాగించలేడు.  ఒక మనిషి మరో మనిషికి సహాయ సహకారాలు అందించుకుంటూ హ్యాపీగా లీడ్ చేస్తుంటారు.  అంతవరకు బాగానే ఉన్నది.  కొత్త సంవత్సరంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటారు.  అలా వాళ్ళు నిర్ధేశించుకునే లక్ష్యాలకు అనుగుణంగా వాటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.  


తాజా నివేదిక ప్రకారం లక్ష్యాలను పెట్టుకున్న ప్రతి ఒక్కరు దానిని చేరుకుంటారా అంటే లేదని అంటున్నాయి.  93శాతం మంది వరకు ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్తున్నారు.  ఎందుకంటే, లక్ష్యం అయితే పెట్టుకుంటున్నారు కానీ, దాని కోసం తగిన విధంగా కృషి చేయడం లేదని చెప్తున్నారు.  తగిన విధంగా కృషి చేస్తే తప్పకుండా లక్ష్యం చేరుకుంటారు.  కానీ, లక్ష్యం ఒకటి, చేయాల్సింది మరొకటిగా ఉంచుకుంటేనే ఇబ్బందులు వస్తున్నాయి.  


ఇక ఇదిలా ఉంటె, కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో అయినా అందరికి మంచి జరగాలని కోరుకోవడం ఉత్తమం.  అందరూ బాగుండాలని కోరుకుందాం.  అందరూ బాగుంటేనే అంతా బాగుంటుంది.  అందరూ మంచిగా ఉంటె అందులో మనం కూడా ఉంటాం.  అలా మనం అందులో ఉన్నప్పుడే దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి.  నిర్ణయించుకున్న పద్ధతులు ఉంటాయి.  కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రపంచం నూతనంగా ఉండాలని కోరుకుందాం. అందరికీ నూతన సంవత్సర ఆనంద దాయక శుభాకాంక్షలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: