ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకపక్క ఆంధ్రరాష్ట్రంలో ఖజానా ఖాళీ గా అప్పులతో ఉన్నాగాని ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాల విషయంలో వ్యక్తిగత విషయంలో ప్రభుత్వ పరంగా వచ్చే నిధులను ప్రజలకు ఖర్చు పెడుతూ అద్భుతమైన సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు మరియు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలలో అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ పేదవాళ్లకు మరియు ఉన్నత చదువులు చదువులేని వాళ్లకు అందుబాటులో ఇంగ్లీష్ మీడియం ఉండే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకు రావటం తో ఇప్పటికే చాలా మంది రాష్ట్రంలో ఉన్న పేద వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మొదటిరోజు ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో బంగారం నింపే విధంగా వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నూతన సంవత్సరం మొదటి రోజు ఈ మేరకు జగన్ సర్కార్ చట్ట సవరణ చేశారు. ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఒక్క ఉద్యోగి కూడా ఉండరు. అందరూ ప్రజారవాణా అనే ప్రభుత్వ విభాగంలో ఉద్యోగులుగా ఉంటారు. జీతాలు వారికి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తారు.

 

ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుతున్నాయి. పని మాత్రం ఆర్టీసీకి చేయాల్సి ఉంటుంది. మొత్తం 51వేల మంది వరకూ ఉద్యోగులు .. ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేరారు. చాలా మంది ఆర్టీసీ కార్మికులు మంచి ముఖ్యమంత్రిని ఆంధ్ర ప్రజలు ఎన్నుకున్నారు మా జీవితాలలో వెలుగులు నింపారు అంటూ కృతజ్ఞతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: