పోలవరం హెడ్ వర్క్స్ పనుల్లో ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ నుండి రూ. 250 కోట్లు అందుకున్న పెదబాబు ఎవరు ? ఇపుడిదే అంశం రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.  ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ టిడిపి మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుదే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సంస్ధ పోలవరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్స్ పనులను దక్కించుకుంది. వేల కోట్ల రూపాయల పనులు చేసేంత సీన్ సంస్ధకు లేకపోయినా కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు మాత్రం భారీ పనులు అప్పగించేశారు.

 

సరే పనులు అప్పగించిన తర్వాత ఎవరినో పెట్టి కాంట్రాక్టులను చేయించుకోవటం కాలా కంపెనీలకు సహజమే. అలాగే రాయపాటి కూడా మొదలుపెట్టారు. అయితే తనకు అందిన పోలవరం కాంట్రాక్టును చూపించి 14 బ్యాంకుల బ్యాంకు కన్సార్షియం ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు. పనులు చేసేటపుడు తీసుకున్న అప్పును చెల్లించాల్సిన బాధ్యత కూడా సదరు కంపెనీ మీదే ఉంటుంది.

 

అయితే ఇక్కడ రాయపాటి బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారే కానీ తిరిగి చెల్లించలేదు. వివిధ బ్యాంకుల్లో తీసుకున్న వేల కోట్ల రూపాయల్లో సుమారు రూ. 795 కోట్లు ఎగొట్టారు. పనులు చేసిన  కాంట్రాక్టు సంస్ధకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను కన్సార్షియంలోని ఏదో ఓ బ్యాంకులో జమచేయాలి. అంతేకానీ వందల కోట్లను ఏ ప్రభుత్వం కూడా నేరుగా డబ్బు రూపంలో చేతికిచ్చేయదు.

 

అయితే  రాయపాటి సంస్ధకు ప్రభుత్వం చెల్లించిన బిల్లులు కన్సార్షియంలోని బ్యాంకుల ఖాతాలో కాకుండా ఇంకేదో బ్యాంకులో వేసేసింది. నిజానికి ఇది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. విషయం తెలిసి కూడా ప్రభుత్వం నిబంధనలను పక్కనపెట్టి మరీ రాయపాటి చెప్పిన ఇంకేదో బ్యాంకులో వేసేసింది. అలా కాకుండా బ్యాంకుల కన్సార్షియంలోనే ప్రభుత్వం డబ్బులు వేస్తే తమ బకాయిలను వసూలు చేసుకునే మిగిలిన డబ్బులను ఖాతాలో వేస్తాయి.

 

అందుకనే ఇంకేదో బ్యాంకులో మొత్తం డబ్బును ప్రభుత్వం వేసిందని సిబిఐ దాడుల్లో గుర్తించింది. తాను చెప్పినట్లుగా ఇంకేదో బ్యాంకులో వేసినందుకు పెదబాబుకు రాయపాటి సుమారు రూ. 250 కోట్లు ముడుపులు చెల్లించినట్లు సిబిఐకి గ్రహించింది. మరి ఆ పెదబాబు ఎవరన్న విషయం సిబిఐ విచారణలో రాబడుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: