ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రాజధాని అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతుల దీక్షలతో అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇది అదునుగా చూసుకుని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన కలిసి సీఎం జగన్ పై విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల అభిప్రాయాలను వీరి సొంత అజెండాలుగా మలచుకుని ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారు. ఇది నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే.

 

 

టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ క్రమశిక్షణకు మారు పేరు అని.. క్రమశిక్షణే దైవంగా ముందుకెళ్తామని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. దేశంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఆయన తనయుడు లోకేశ్ సైతం చెప్పుకుంటారు. కానీ.. రాజధాని అంశంలో సీఎం జగన్ పై వారు చేస్తున్న విమర్శలు విన్నా.. చదివినా మాత్రం జుగుప్స కలగకుండా మానవు. 'రైతుల ఉసురు పోసుకోవద్దు.. రైతులను ఏడిపించిన వారు బాగుపడరు..' ఇలాంటి వాఖ్యలు ఏ విధంగానూ.. ఎవరూ హర్షించదగినవి కావు. ప్రతిపక్షంగా పోరాడాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలతో చులకన కావడం తప్ప ఏమీ జరుగదు. గతంలో జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టి ఇప్పుడు విపక్షాలు చేస్తున్నదేంటో అనే విమర్శలూ లేకపోలేదు.

 

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేసి మరీ తప్పుగా మాట్లాడుతున్నారనే చెప్పాలి. 'మట్టిలో కలిసిపోతారు.. కొట్టుకుపోతారు' అనే వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తప్పుబట్టారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా మరీ ఇటువంటి వాఖ్యలు హర్షించదగినవి కావు. ఇటువంటి వాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలు కంటే దారుణం. ప్రజల కోసం పోరాడేటప్పుడు ప్రజాపక్షం నిలవడంలో తప్పులేదు. ఎదుటి వ్యక్తిని తిట్టడం మాత్రం కచ్చితంగా తప్పే.

మరింత సమాచారం తెలుసుకోండి: