ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంభట్లలో జరిగిన జల్లికట్టు క్రీడలో అపశృతి చోటు చేసుకుంది. పశువును లొంగదీయడానికి యువకులు ప్రయత్నించగా కోడె గిత్తలు కుమ్మేయడంతో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు యువకులను స్థానిక ఆస్పత్రికి గ్రామస్థులు తరలించారు. భారీ సంఖ్యలో ఈ వేడుకకు జనాలు హాజరు కావటం గమనార్హం. 
 
గాయపడిన యువకుల పేర్లు జీవన్, రమేష్ అని సమాచారం. వీరు పశువును లొంగదీసుకునే ప్రయత్నం చేయగా ఎద్దు కొమ్ము జీవన్ తలకు బలంగా తగిలింది. ఎద్దు కొమ్ము తగలడంతో జీవన్ కు చెవి దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. జీవన్ కు తీవ్ర గాయాలు కాగా రమేష్ స్వల్పంగా గాయపడ్డాడు. రమేష్ కు కంటి దగ్గర తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రశాంతంగా ప్రారంభమైన జల్లికట్టు వేడుక చివరకు రక్తపాతానికి దారి తీసింది. 
 
ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో భారీ ఎత్తున జల్లికట్టు వేడుకలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన కొత్తశానంభట్లలో జరిగే ఈ వేడుకలకు భారీ సంఖ్యలో జనాలు హాజరవుతారు. జల్లికట్టు తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకొని లొంగదీసుకునే ఆట. చిత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉండటంతో చిత్తూరు జిల్లాలోని చాలా గ్రామాలలో జల్లికట్టు ఉత్సవాలు జరుగుతాయి. 
 
జల్లికట్టు ఒక ఆటవిక సాంప్రదాయం. మూగ జీవాలతో ఆడే ఈ వికృత క్రీడకు ఇప్పటికే ఎంతో మంది బలయ్యారు. జల్లికట్టు క్రీడలో ఇప్పటికే చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సంక్రాంతి పండుగ సమయంలో సాంప్రదాయం అని చెప్పుకొని చాలా ప్రాంతాలలో జల్లికట్టును నిర్వహిస్తుంటారు. జల్లికట్టు తమిళనాడు సాంప్రదాయ పండుగ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా చోట్ల ఈ పండుగ కొనసాగుతోంది. ఈ సాంప్రదాయంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ సాంప్రదాయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఈ సాంప్రదాయాన్ని వ్యతిరేకించటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: