1947 లో ఇండియా పాకిస్తాన్ లు విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  రెండు దేశాల మధ్య ఇప్పటికే నాలుగు సార్లు యుద్ధం జరిగింది.  నాలుగు యుద్ధాల్లో ఇండియా విజయం సాధించింది.  అయినప్పటికీ పాక్ కు బుద్దిరాలేదు.  ఇంకా ఇండియాపై కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నది.  ఇండియా తీసుకునే చారిత్రాత్మక నిర్ణయాలను పాక్ వ్యతిరేకిస్తూనే ఉంటుంది.  


ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ ఇండియాపై ఎన్ని ఆరోపణలు చేసిందో చెప్పక్కర్లేదు.  ఐక్యరాజ్య సమితిలో ఇండియాపై ఎన్ని ఆరోపణలు చేయాలో అన్ని ఆరోపణలు చేసింది.  కాశ్మీర్లోని ముస్లింల విషయంలో ఇండియా ఉక్కుపాదం మోపుతోందని, మానవ హక్కులు దారుణంగా ఉన్నాయని ఆరోపణలు చేసింది.  అంతేకాదు, ఇండియాలోకి పాక్ ఉగ్రవాదులను ఎగదోసి కాశ్మీర్ లో శాంతిభద్రతలు లేకుండా చూడాలని అనుకుంది.  


కానీ, ఇండియా దానిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  బోర్డర్ లో ఇండియా సైన్యం నిరంతరం పహారా కాస్తోంది.  ప్రస్తుతం కాశ్మీర్లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి.  ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను పునరుద్ధరించింది.  వేలాదిమంది కాశ్మీర్ యువత సైన్యంలో జాయిన్ కావడంతో కాశ్మీర్ లో ఆనందం వెల్లివిరిసింది.  


ఇకపోతే, ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 70 వేలమంది సైనికులను వెనక్కి రప్పించింది.  ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.  యువతకు ఉపాధి లభిస్తోంది.  50వేల ఉద్యోగాలు ప్రకటించారు.  ఇక ఇదిలా ఉంటె, ఇండియా ఈ ఏడాది నుంచి కొత్త పోస్ట్ ను క్రియేట్ చేసింది.  అదే సీడీఎస్.  చీఫ్ డిఫెన్స్ స్టాఫ్.  భారత మొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్ ను నియమించింది.  బిపిన్ రావత్ ను చీఫ్ డెఫన్స్ స్టాఫ్ గా నియమించడంతో ఆందోళన చెందుతున్నది.  బిపిన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అందరికి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: