రాజకీయాల్లో నటించడాలు ఉండవు జీవించడాలే ఉంటాయి. నిత్యం ప్రజల కోసమే తాము కష్టపడిపోతున్నామన్నట్టుగా నటిస్తూనే జీవన్ చేస్తూ పూర్తిస్థాయిలో జీవించలేక నటించలేక సతమతమై పోతుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పైకి ఈ ఇద్దరూ రెండు పార్టీలతో రెండు భిన్న ధ్రువాలుగా కనిపిస్తున్నా వీరి అజెండా అంతా ఒక్కటై అన్న అభిప్రాయం ప్రజలు అందరిలోనూ వచ్చేసింది. అయినా వీరు మాత్రం తమ నటనను ఆపకుండా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైపోతున్నారు. తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలే అన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఎప్పుడో కలిగింది. అయినా వీరిద్దరు తమ నటనను ఏ మాత్రం ఆపకుండా ప్రజల కోసం తమ జీవితం అంకితం అన్నట్టుగా నటిస్తూనే ఉన్నారు.

 

 ఏపీలో వైసిపి ప్రభుత్వానికి ఈ ఏడు నెలల కాలంలో జనాల్లో పెరిగిన ఇమేజ్ ను చూసి ఈ రెండు పార్టీల అధినేతల్లో ఎక్కడలేని ఆందోళన, కంగారు మొదలయ్యింది. ఇదే రకంగా జగన్ కు మద్దతు పెరుగుతూ వెళ్తే రాజకీయంగా తమకు ఇబ్బంది అనే విషయాన్ని ముందుగానే గుర్తించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టినట్టుగా చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. మూడు రాజధానుల విషయంలో జగన్ కు, ఆయన పార్టీకి రెండు ప్రాంతాల్లో అనూహ్య మద్దతు లభించడంతో పాటు, జగన్ నిర్ణయాన్ని పార్టీలకతీతంగా సమర్థిస్తూ ఉండడంతో భయం పట్టుకున్న ఈ నేతలు ఇద్దరూ జగన్ ప్రభుత్వం పై బురదజల్లడమే తమ అజెండాగా రంగంలోకి దిగిపోయారు.

 

 రాజధాని రైతుల్లో జగన్ నిర్ణయం పై సానుకూల స్పందన ఉన్నా కొంతమంది టిడిపి అనుకూల వ్యక్తులతో కలిసి అమరావతి ప్రాంతంలో నిరసనలు, దీక్షలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా హడావిడి చేస్తూ మరింతగా అభాసుపాలు అవుతున్నారనే విమర్శలు మూట కట్టుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చంద్రబాబు బాటలో పయనిస్తూ జనసేన పార్టీ ఎదుగుదలను తన చేజేతులా నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తుండటం ఆ పార్టీలోని నాయకులు నచ్చడం లేదు.


 అందుకే ఇప్పటికీ చాలామంది నాయకులు బయటకు వెళ్ళిపోవడమే కాకుండా పవన్ చంద్రబాబు మనిషి అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి చంద్రబాబుకు ఒరిగేది, తరిగేది ఏమీ లేకపోయినా జనసేనకు మాత్రం రాజకీయంగా ముందు ముందు ఇబ్బందికర పరిణామాలు తీసుకొస్తాయి. ఈ విషయాన్ని పవన్ గుర్తించకుండా చంద్రబాబు చూపించిన బాటలోనే నడిస్తే జనసేన పార్టీ రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి రావడానికి ఎంతో కాలం పట్టదు అనేది విశ్లేషకుల అంచనా. మరి పవన్ ఇంకా బాబు ట్రాప్ నుంచి బయటపడకపోతే పవన్ బాబు ఇద్దరూ దొందూ దొందే అనే అనుమానం అందరిలోనూ మరింత బలపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: