దేశంలోనే అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకుల పోటీని ఎదుర్కుంటూ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ గా మొదటి స్థానంలో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అత్యధికంగా ఖాతాదారులను కలిగి ఉంది ఈ బ్యాంక్. ప్రస్తుతం దేశ ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో ఈ బ్యాంకు లోనే ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎన్ని ఉన్నప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన బ్రాంచీలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైపే మొగ్గు చూపుతున్నారు ప్రజలు. 

 

 

 ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు కోసం వినూత్న ఆలోచనలు చేస్తూ సరికొత్త ఆఫర్ లను  ప్రకటిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తమ కస్టమర్ల సెక్యూరిటీ కోసం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఇక మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను తమ వినియోగదారులకు అందిస్తూ... నెంబర్ వన్ బ్యాంకింగ్ సంస్థ గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన 3 రూల్స్ నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త రూల్స్ ని తప్పక పాటిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరిన్ని సేవలు పొందడానికి అవకాశం ఉంది. 

 

 

 అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మూడు కీలక కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. తగ్గిన ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రేటు ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. అంతేకాకుండా ఏటీఎం కార్డు లేకపోయినప్పటికీ ఓటిపి ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే కీలక నిర్ణయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రూల్  నేటి  నుండి అమలులోకి రానుంది. దీనిద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు అని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అంతేకాకుండా మాగ్నెటిక్ స్ట్రిప్  లేకుండా వాడుతున్న డెబిట్ కార్డులన్ని  ఈరోజు నుండి పని చేయవు. తమ తమ బ్రాంచ్లో సంప్రదించి కొత్త డెబిట్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: