ఒకప్పుడు సందేశాన్ని పంపాలంటే అందరికీ ఉత్తరాలే దిక్కు... ఉత్తరం  వెళ్లి పోస్ట్ ఆఫీస్ లో వేస్తే అక్కడి నుంచి మనం పంపిన వారి దగ్గరికి చేరడానికి సమయం కూడా చాలానే పట్టదు. కానీ రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ తో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఎలాంటి సందేశం అయినా అవతల వారికి పంపించవచ్చు. ప్రస్తుతం సందేశాలని పంపుకోవడానికి ఆన్లైన్ లో ఎన్నో యాప్స్ నెటిజన్లను  ఆకర్షిస్తూనే ఉన్నాయి. అయితే ఆన్లైన్ లో ఎన్ని యాప్స్ ఉన్నప్పటికీ నెటిజన్లు ఎక్కువగా యూస్ చేసే యాప్ మాత్రం వాట్సాప్. ఇప్పుడు వాట్సాప్ యుగం నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆన్లైన్ లో ఎన్ని యాప్స్ ఉన్నప్పటికీ వాట్సాప్ కి ఉన్న క్రేజ్ సపరేట్. మన దేశంలో ఎక్కువమంది వాట్సాప్ వినియోగదారులే  ఉన్నారు. 

 

 

 

 వాట్సాప్ వచ్చినప్పటినుంచి నెటిజన్లని  ఆకర్షిస్తూ రోజురోజుకి వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం ఎంతోమంది వాట్సాప్ ద్వారానే సందేశాలు పంపుతున్నారు. ఫోన్ లో వాట్సాప్ లేదు అంటే పిచ్చెక్కి పోయే వాళ్లు కూడా చాలామంది. అంతేకాకుండా డైరెక్ట్ గా మాట్లాడుకోవడం కంటే వాట్సాప్లో మాట్లాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేటితరం జనాలు. డైరెక్ట్ గా కలవడానికంటే  ఫోన్ లో వీడియో కాల్ ద్వారా కలవడానికి ఇష్టపడుతున్నారు.  ఇకపోతే అటు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను  తీసుకొస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. సరికొత్త ఫీచర్లతో అందరినీ ఆకర్షిస్తూ రోజు రోజుకి  మరింతమంది వినియోగదారుల సంఖ్య పెంచుకుంటుంది  వాట్సాప్. 

 

 

 

 ఇప్పటికే ఎన్నో వినూత్న ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ ప్రస్తుతం 2020 సంవత్సరానికి గాను కొన్ని అద్భుతమైన ఫీచర్లు తీసుకొచ్చింది . వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్లతో ముఖ్యమైనది డార్క్ మోడ్.. ఈ ఫీచర్ను తీసుకురావడం ద్వారా వాట్సాప్ వినియోగదారుల కళ్ళకి శ్రమ తగ్గింది. ఈ ఫీచర్ ద్వారా బ్యాక్ రౌండ్  బ్లాక్ లో లెటర్స్  వైట్ కలర్ లో ఉంటుంది. మరో ఫీచర్ ఆటోమేటిక్ డిలీట్. ఈ ఆప్షన్ ద్వారా మీరు పంపిన మెసేజ్ లు  కొంత సమయం తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతు  ఉంటాయి. ఇక ఫ్రమ్  ఎఫ్బి, యాడ్స్, వాట్సాప్ పే ఈ ఏడాదే అప్ డేట్ కానున్నాయి. ఈ ఫిచర్లకు వాట్సాప్ వినియోగదారులందరికీ మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: