కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ ప్రస్తుతం ప్రజల జీవితం లో కీలకంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ కార్డు లేనిదే మనిషి ఏమి చేయలేక పోతున్నారు. ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంది అంటేనే  మనిషికి ఒక  గుర్తింపు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ఉంటేనే దేశంలో మనమంటూ ఒకరం  ఉన్నామని ఒక ఐడెంటిటీ ఉంటుంది. ప్రస్తుతం ఏ చిన్న పని చేయాలన్నా దానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. బ్యాంకు ఖాతా తెరవాలి అన్న... లోన్ తీసుకోవాలి అన్న.. చివరికి సిమ్ కార్డు తీసుకోవాలి అన్న కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకున్న పర్లేదు కానీ ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి అనే నిబంధనను కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఆధార్ అంటే అన్ని వివరాలు ఉన్నట్టే. 

 

 

 అంతేకాదు ప్రభుత్వం సైతం ఆధార్ కార్డు ఆధారంగానే ప్రజలకు ప్రభుత్వ పథకానికి అర్హులా  కాదా అనే విషయాన్ని తెలుస్తున్నాయి. ఒక ఆధార్ నెంబర్ ఉంటే చాలు మిగతా డీటెయిల్స్ అని వచ్చేస్తూ ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు లో కొన్ని తప్పులు దొర్లడం వల్ల ఇప్పటికి ఎంతో మంది ప్రజలు ఆధార్ సరి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆధార్ నమోదు చేసుకునేందుకు ప్రజలకు పలు రకాల సేవలను అందుబాటులోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఆధార్  తప్పులను సవరించడం మాత్రం పూర్తి స్థాయిలో జరగడం లేదు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు ప్రతిచోట ప్రజలకు వినియోగ పడుతున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు ఆధార్ కార్డు మరింత ఉపయోగపడేలా మరో కీలక నిర్ణయం వెలువడింది. 

 

 

 ఆధార్ కార్డ్ వినియోగదారులకు మరింత ఉపయోగపడేలా భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ యుఐడిఎఐ కీలక నిర్ణయం తీసుకుంది. యుఐడిఎఐ వెబ్సైట్ లో  చాట్ బాట్  ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. ఆధార్ కు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా చాట్ బాట్ ద్వారా  తెలియజేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది యుఐడిఎఐ. అయితే ఆధార్ కార్డులో  ఏవైనా సమస్యలు ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు... అలాంటి వారికి ఎక్కువగా ఉపయోగపడేలా ఇలాంటి సదుపాయం తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: