ప్రతిరోజు దేశంలో ఎన్నో జన్మదినాలు ఎన్నో మరణాలు ఇంకా ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. దేశవ్యాప్తంగా గుర్తుండిపోయే ఎంతో మంది ప్రముఖుల జననాలు... మరణాలు సహా దేశం మొత్తం గుర్తుంచుకునే చేదు తీపి జ్ఞాపకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే జనవరి 2న చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

 

 

 భారతరత్న అవార్డు స్థాపన  : 1954 జనవరి 2వ తేదీన ఆనాడు భారత దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఉన్న.. డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారత రత్న పురస్కారాన్ని స్థాపించారు. ఆనాటి నుండి నేటి వరకు ఇప్పటికీ దేశంలో భారతరత్న పురస్కారం అత్యున్నతమైనది గా కొనసాగుతోంది. దేశానికి సేవ చేసిన చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులకు భారతరత్న పురస్కారం లభిస్తుంది. భారతరత్న పురస్కారాన్ని ఎంతో ప్రతిష్టగా  భావిస్తూ ఉంటారు ప్రముఖులు. ప్రస్తుతం భారతదేశంలో అత్యున్నతమైన ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం భారత రత్న పురస్కారం. ఆనాడు భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారతరత్న పురస్కారాన్ని స్థాపించినప్పటి నుంచి ఎంతోమంది ప్రముఖులు భారత రత్న పురస్కారాన్ని అందుకుని  చరిత్రలో నిలిచిపోయారు. 

 

 

 ఏవీఎస్ జననం : ప్రముఖ హాస్య నటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం 1957 జనవరి 2వ తేదీన తెనాలిలో జన్మించారు. తెలుగు ప్రేక్షకులందరికీ ఏవిఎస్ గా కొసమెరుపు. సినిమాల్లో కమెడియన్ గా నటించి తనదైన స్టైల్ కామెడీతో తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు ఏవీఎస్. ఒక కమిడియన్  గానే కాకుండా సినీ రచయితగా నిర్మాతగా కూడా తెలుగు కళామతల్లికి సేవలందించారు ఏవీఎస్. ఎంతో మంది ప్రేక్షకులను తన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే  కాకుండా ఎంతో మంచి మంచి సినిమాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులను అందించాడు . ఎన్నో అవార్డులు రివార్డులను సైతం సొంతం చేసుకున్నారు. 2013 నవంబర్ 18న హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు ఆయన .

 

 

 ఆహుతి ప్రసాద్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆహుతిప్రసాద్ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. తండ్రిగా, తాతగా,  విలన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆహుతి ప్రసాద్. ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో  నటించి ఎన్నో అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో జీవించి మరి నటించేవాడు. 1958 జనవరి 2వ తేదీన ఆహుతిప్రసాద్ జన్మించగా... 2015 సంవత్సరంలో మరణించారు.

 

 

 ఆదిభట్ల నారాయణ దాసు మరణం : ప్రముఖ హరికథా పితామహుడు. ఆగస్టు 31,  1864 లో జన్మించిన ఈయన... జనవరి 2 1945 వ సంవత్సరంలో మరణించారు. ఈయన చేసిన రచనలు నాటికలకు గాను హరికథా పితామహుడు అనే బిరుదులు సొంతం చేసుకున్నారు ఆదిభట్ల నారాయణదాసు. ఇప్పటికీ హరి కథలు చెప్పే వాళ్ళందరూ ఆదిభట్ల నారాయణదాసు కు ముందుగా వందనాలు చెప్పి హరికథలను ప్రారంభిస్తూ ఉంటారు.

 

 

 ప్రపంచ శాంతి దినోత్సవం : జనవరి 2వ తేదీన ప్రపంచ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచం మొత్తం శాంతి నెలకొనేలా ఉండేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ జనవరి 2వ తేదీన శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: