ప్రతి ఏడు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా నేడు జనవరి 1 సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభం అయింది.  ఈ ప్రదర్శన బుధవారం సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ సంబంధిత శాఖ మంత్రి తలసాని, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గార్లు  ప్రారంభించారు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ సందర్శన ప్రారంభమైంది.ఇకపోతే ఈ సంఘర్షణలో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఉన్న మార్గాలకు అదనంగా 6 ఏర్పాటు చేశారు. 

 

 

అంతేకాకుండా గతంలో దాదాపు 2500 స్టాళ్లు ఏర్పాటు చేసే వారు కానీ ఈ సంవత్సరం మాత్రం వాటిని కుదించి  1500 నుంచి 2000 వరకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఈ సందర్శనలు నిరంతరం నిఘా సీసీ కెమెరాలతో నిఘా సెక్యూరిటీ తనిఖీలు వాచ్ అండ్ వార్డు  సిబ్బందితో స్టాళ్లను  ఏర్పాటు చేయడం సహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర తనిఖీలు చేపట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అధికారులు.  కాగా  సందర్శకుల సౌకర్యార్థం మెట్రో రైలు రాత్రి 11 గంటల వరకు నడపనున్నారు . ఈ  సందర్శనకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

 

 

 కొత్త సంవత్సరాన్ని దృష్టి పెట్టుకొని ఎగ్జిబిషన్ సొసైటీ ఈ సంవత్సరం పబ్లిక్ లయబిలిటీ కింద 5 కోట్ల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది.అంతే కాకుండా ప్రతి స్టాల్  హోల్డర్ స్టాలిన్ ఇన్సూరెన్స్  తప్పనిసరిగా చేసుకోవాలని సొసైటీ నిబంధన విధించింది . అంతేకాకుండా సదరు వ్యక్తులు ఏర్పాటుచేసిన స్టాల్లల్లో  తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ చర్యలు ఖచ్చితం అని తెలిపింది . అంతేకాకుండా సభ సందర్శన కోసం వస్తున్న ప్రజలందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న ప్రవేశంలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసిన తర్వాతే లోపల పంపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: