ఉత్తరాంధ్ర పట్ల చంద్రబాబు భువనేశ్వరిలు వ్యతిరేకమని తేలిపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం ధర్మం కాదని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు, భువనేశ్వరి వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వైఖరిని డిప్యూటీ సీఎం కడిగిపారేశారు.  అడ్డంగా దొరికిపోయిన బాబోరు ఇప్పుడు ఇంట్లోని ఆడోళ్లను అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

భయంతో.. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణతో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. సచివాలయంలో మాట్లాడుతూ.. ఆమె మాట్లాడుతూ.. అందుకే ఇంట్లోని ఆడవాళ్లను తెచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డరు.. అమరావతిలో చంద్రబాబుతో కలిసి పర్యటించిన ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను రాజధాని రైతులకు అందించారు. అంత వరకు బాగానే ఉంది. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం కానీ భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. వాళ్ల భర్త అన్యాయంగా తీసుకున్న రైతుల భూములని స్పష్టం చేశారు.

లెక్కలు చెప్పాలి .
రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో భూములు కొట్టేసింది మీ భర్త చంద్రబాబు కాదా అని భువనేశ్వరిని సూటిగా ప్రశ్నించారు. హెరిటేజ్‌ పేరుతో రాజధానిలో ఉన్న భూములపై భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్‌ పేరుతో ఉన్న 14 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలు 4 వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా అని నిలదీశారు. ఆ 4వేల ఎకరాలు రైతుల కిస్తే మీరు ఇచ్చిన గాజుల కంటే ఎక్కువ మేలు చేస్తాయని అన్నారు. ఇప్పుడు తనను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు తన భార్య భువనేశ్వరిని  రంగంలోకి దించారని దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా ఆమె చేతి గాజులను విరాళంగా  ఇప్పించి నాటకానికి తెరలేపాడని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు నారా భువనేశ్వరి నందమూరి భువనేశ్వర్ గా మార్చేసిన ఆశ్చర్యం లేదన్న మండిపడ్డారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారుతానడానికి ఇదే ఉదాహరణ అని పుష్ప శ్రీవాణి అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: