ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై ప్రముఖ పాత్రికేయుడైన ‘ది ప్రింట్’ ఎడిటర్, రచయిత శేఖర్ గుప్తా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మూడు రాజధానుల అంశాన్ని పిచ్చి పనిగా, తుగ్లక్ చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ రాజధాని మార్పును అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఈ మేరకు అమరావతిని పునర్నిర్మించాలనే ఆదేశాలను ప్రధాని మోదీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇవ్వాలని ఆయన సూచించారు.


అమరావతి నగరం అద్భుతం అవుతుందని అనుకున్నాం. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత గొప్ప రాజధాని నిర్మించే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలి. అమరావతిని పునరుద్ధరిస్తే అది తూర్పు ప్రాంతంలో గొప్ప నగరం అవుతుంది. సంపద, ఉద్యోగాలు రావాలంటే కొత్త నగరాలు రావాల్సి ఉంటుంది. 


దక్షిణాఫ్రికా ఆదర్శంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం విషాదకరమైన విషయం. పాలకులపై తుగ్లక్ ప్రభావం బాగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూడు రాజధానుల అంశం మహ్మద్ బిన్ తుగ్లక్ చర్య. ఒకేసారి 20 కప్పుల డబుల్ కెఫిన్‌ గల కాఫీ తాగినట్లుగా ఉంది. ఇది చాలా పిచ్చి చర్య. జమ్ములో వాతావరణాన్ని బట్టి.. శీతకాలంలో జమ్ము, వేసవిలో శ్రీనగర్‌గా పెట్టుకున్నారు. కానీ ఏపీలో ఆ అవసరం లేదు. ఇలా రెండు రాజధానుల వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ ఉదాహరణ కళ్లెదుట పెట్టుకొని 3 రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకోవాలి.’’


విశాఖపట్నంలో కార్యనిర్వహక వ్యవస్థ అని, అమరావతిలో అసెంబ్లీ అని, రాయలసీమలో హైకోర్టు అని చెప్తున్నారు. దీనికి వారు దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతున్నారు. అక్కడ వాణిజ్య రాజధాని జొహన్నెస్‌బర్గ్. లేజిస్లేటివ్ క్యాపిటల్ కేప్‌టౌన్, న్యాయ రాజధాని బ్లూమ్ ఫౌంటేన్. ఇలా అక్కడ మూడు రాజధానులు ఎందుకు పెట్టుకున్నారో మనకు అనవసరం. కానీ ఇప్పుడు, 21వ శతాబ్దంలో మన దేశంలోని ఒక రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టాలనుకోవడం బాధాకరం. ఇప్పుడు, ప్రభుత్వం రాజధాని నగరం ఎంపికపై మరో కమిటీని నియమించినా, ఉపయోగం ఉండదని విశ్లేషించారు

మరింత సమాచారం తెలుసుకోండి: