కొన్ని కొన్ని విషయాలు ఎంత చెరపాలని చూసినా చెరగవు. జనాల్లోకి బలంగా వెళ్ళిపోయి బలమైన ముద్ర పడిపోతూ ఉంటాయి. అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతూ వస్తోంది. అమరావతి కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధాని అనే ముద్ర జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. అప్పట్లో అధికారంలో ఉన్న టిడిపి కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే రాజధాని ఎంపిక చేసింది అనే0 విషయాన్ని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి బాగా హైలెట్ చేసింది. కానీ అప్పుడు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే సాహసం టిడిపి చేయలేదు. ఈ విషయాన్ని అసలు పట్టించుకోనట్టుగానే ఉంది. అలాగే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏది రాజధాని ? అని ఎవరి రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం పై సెటైర్లు కూడా వేశారు. 

 

వాస్తవంగానే అక్కడ బాబు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గా అప్పుడు వైసిపి వేసిన నిందలను బాబు ఇప్పుడు చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజధాని ఒకే సామాజిక వర్గానికి చెందింది అంటూ జగన్ రాజధాని అమరావతి పై కుల ముద్ర వేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని, ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారా అంటూ బాబు ప్రశ్నిస్తున్నారు. ఒక నగరం అభివృద్ధి చెందితే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ లబ్ధి పొందుతారని ఆయన గుర్తు చేస్తున్నారు.

 

 అమరావతిపై సామాజిక ముద్రవేసి జగన్ కనుక రాజధాని తరలిస్తే మిగతా కులాల వారు నష్టపోతారని బాబు చెబుతున్నారు. బాబు ఈ విషయం ప్రజలకు ఎంత సూటిగా అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించినా  ప్రజల్లో పడిపోయిన ముద్ర మాత్రం చేరగదు. ఈ విషయంలో చంద్రబాబు ఆలస్యంగానే మేల్కొన్నత్తుగానే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల్లో చేపట్టిన నిరసన దీక్షలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో అప్పట్లో వైసీపీ చేసిన ఆరోపణలు నిజమే అనే విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నాయి. కానీ మొదట్లోనే టీడీపీ ఈ తరహా వ్యాఖ్యలను గట్టిగా ఖండించే ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: