చంద్రబాబు రాజకీయానికి అడ్డు అదుపు ఉండదు. బంధుత్వం అయినా, స్నేహం అయినా బాబు రాజకీయ అవసరాల కొరకు మాత్రమే అది ఉంటుంది తప్ప, చిరకాలం ఆయనకు మిత్రులు లేరు, ఆయన కోసం పరితపించే అంత స్థాయిలో బంధువులు లేరు. చంద్రబాబు నాయుడు నైజం గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరు ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లే సాహసం చేయరు. అలా వెళ్లిన వాళ్ళు చాలామంది పరిస్థితి  ఏమయిందో అందరికీ తెలుసు. చంద్రబాబు తనకు తాను రాజకీయ మేధావిగా చెప్పుకుంటారు. అవును నిజమే చంద్రబాబు నిజంగా రాజకీయ మేధావి.

 

అలా కాకపోయి ఉంటే బంధువులను తన రాజకీయం కోసం బలి చేసి ఉండేవారు కాదు. మామకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ పగ్గాలు లాక్కున్నారనే అపవాదు చంద్రబాబు మీద  వచ్చి ఉండేది కాదు. అలాగే తన బావమరిది నందమూరి హరికృష్ణను  రాజకీయంగా ఎదగకుండా బాబు అడ్డు పడే వాడు కాదు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధరేశ్వరిలను  తెలుగుదేశం పార్టీకి దూరం చేసి ఉండేవాడు కాదు.


 నందమూరి వంశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు ఎన్టీఆర్ట్ కుటుంబం నుంచి ఎదురే లేకుండా చేసుకునేందుకు తన బావమరిది బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని తన కొడుక్కి ఇచ్చి కట్ట పెట్టేవాడు కాదు. ఇప్పుడు రాజకీయంగా తాను ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తాను చెబుతున్న మాటలు, దీక్షలు ధర్నాలు, ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో తన భార్య భువనేశ్వరి రంగంలోకి ఉండేవాడు కాదు. నిజమే అమరావతిలో తన భార్య భువనేశ్వరి రోడ్డు మీదకు తీసుకువచ్చి రైతులకు మద్దతు ప్రకటించి మహిళల్లో సెంటిమెంట్ రగిల్చే వాడు కాదు.

 

తన మాటలు జనాలు నమ్మడం లేదు అనే విషయాన్ని పైకి తెలియకుండా కవర్ చేసుకునేవాడు కాదు. తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని నందమూరి సుహాసిని గా పేరు మర్చి తన రాజకీయ ఎత్తుగడలకు ఉపయోగించుకునే వాడు కాదు. అవును నిజంగా చంద్రబాబు రాజకీయ మేధావి కాకపోయి ఉంటే ఇంకెన్ని దారుణాలు జరిగి ఉండేవో ?

మరింత సమాచారం తెలుసుకోండి: