టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి. ఈమె ఎన్టీఆర్ కూతురు అన్న విషయం తెలిసిందే. భర్త ఉమ్మడి ఏపీకి 9ఏళ్లు, ప్రస్తుత ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేసినా ఆమె పెద్దగా పార్టీ కార్యక్రమాలకు వచ్చే తరహా కాదు. సొంత కంపెనీ హెరిటేజ్ కార్యకలాపాలు ఆమె చక్కబెట్టేవారు. ఒకటి అరా కార్యక్రమాలకు తప్పంచి పెద్దగా జనంలోకి రారు కూడా.

 

ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న నారా భువనేశ్వరిని ఇప్పుడు చంద్రబాబు అమరావతి ఆందోళనల్లోకి తీసుకొచ్చారు. కొత్త సంవత్సరం వేళ అమరావతి గ్రామాల్లో జరిగిన ఆందోళలకు భార్యతో సహా హాజరయ్యారు. అంతే కాదు.. అసలు ఆమె తనను ఈ ఆందోళనకు రమ్మని చెప్పిందన్నారు చంద్రబాబు. అయితే పాపం. నారా భువనేశ్వరి ఆందోళనలో మామూలుగా పాల్గొని వస్తే బాగానే ఉండేది.

 

సెంటిమెంట్ డ్రామా కోసమో ఏమో గానీ.. ఆమెతో అమరావతి రైతుల ఉద్యమానికి బంగారు గాజు విరాళంగా ఇప్పించారు చంద్రబాబు. పాపం.. ఎన్టీఆర్ బతికి ఉంటే.. అబ్బో నా అల్లుడి నటన ముందు నా నటన బలాదూర్ అని అనుకునేవారో ఏమో..అనే రేంజ్ లో ఈ సీన్ క్రియేట్ చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. రాజధానికి గ్రామస్తులకు నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో కొట్టేసిన భూములు ఇచ్చేయాలని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి.

 

బంగారు గాజుకు బదులుగా హెరిటేజ్ పేరిట కొట్టేసిన 14.22ఎకరాలు, టీడీపీ నేతలు దోచుకున్న 4వేల ఎకరాల్ని తిరిగి ఇచ్చేయాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి ప్రజాశ్రేయస్సు అవసరం లేదని, భూముల్ని కాపాడుకునేందుకు అమరావతిలో రాజకీయం చేస్తున్నారని పుష్ప శ్రీవాణి కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు విపక్షంతో తాను తిట్లుపడేది కాకుండా పాపం.. భార్య భువనేశ్వరిని కూడా తిట్టిస్తున్నారన్నమాట.

 

 

ప్రస్తుతం పుష్ప శ్రీవాణి వంతు అయిపోయింది. ఇక రేపు ఇంకెవరు స్పందిస్తారో. ఇది చూసి.. అసలు ఈ గొడవలోకి భువనేశ్వరిని ఎందుకు లాగారంటూ సొంత పార్టీ నేతలే విసుక్కుంటున్నారు. సానుభూతి కోసం లేనిపోని సెంటిమెంట్ ప్లే చేస్తే అది ఇలాగే తిప్పికొడుతుందని తలపట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: