కేసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో కేసీఆర్ తర్వాత ఎవరు అంటే రెండు సమాధానాలు వచ్చేవి.. అవి కేటీఆర్, హరీశ్ రావు.. కానీ కొన్ని కారణాల కారణంగా కేసీఆర్ కేటీఆర్ వైపే మొగ్గుచూపారని వార్తలు వచ్చాయి. అందుకే హరీశ్ రావును పార్టీ లో క్రమంగా సైడ్ చేస్తున్నారని కూడా కథనాలు వచ్చాయి.

 

టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినా హరీశ్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం.. మరోవైపు పార్టీ పగ్గాలు కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టడంతో అంతా ఇక కేసీఆర్ తర్వాత కేటీఆరే అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ తర్వాత సీఎం రేసులో కేసీఆర్ కూతురు కవిత కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని మానుకోట ఎంపీ మాలోతు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

 

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ మహబూబాబాద్‌లో బుధవారం మూడు మొక్కలు నాటారు. అనంతరం తన పార్లమెంట్‌ పరిధిలోని నర్సంపేట, డోర్నకల్‌, పినపాక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్‌, రేగ కాంతారావులకు ఆమె గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. అయితే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేశాయి. మరి ఈ వ్యాఖ్యలు కవితకు తెలిసే అన్నారా.. లేదా అభిమానంతో అన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

 

మరోవైపు.. కేసీఆరే సీఎంగా ఉంటారని.. సీఎం పదవి గురించి ఊహాగానాలు వద్దని మంత్రి కేటీఆర్ మీడియాతో కామెంట్ చేశారు. న్యూయఇయర్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2018 చివరిలో అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలతో 2019 సంవత్సరాన్ని ఆరంభించుకున్నాం. టీఆర్‌ఎస్‌ భారీసంఖ్యలో సీట్లు గెలిచి.. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యారు. 2020 కూడా ఆదేరకమైన ఆరంభాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు కేటీఆర్ .

మరింత సమాచారం తెలుసుకోండి: