ప్రపంచంలో సభ్యసమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతాలు జరుగుతున్నాయి. బయట సమాజంలోనే కాదు ఇంట్లో కూడా ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది. కన్న కూతురు అనే మానవత్వం లేకుండా ఒక కామాంధుడు తన కూతురు 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే లైంగిక దాడికి పాల్పడి నరకం చూపించాడు.
 
తండ్రి అత్యాచారం చేయటం వలన 13 సంవత్సరాల బాలిక గర్భం దాల్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత బాలిక ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. బ్రెజిల్ లోని కోరీలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. టామె ఫౌబా అనే 36 సంవత్సరాల వ్యక్తి 13 సంవత్సరాల వయస్సు గల కూతురు లౌనా కెట్లేన్ ను గడచిన నాలుగు సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. 
 
కొన్ని నెలల క్రితం లౌనా తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లిన సమయంలో టామె ఫౌబా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలిక శరీరంలో మార్పులు, విపరీతమైన కడుపునొప్పి రావడంతో బాలిక గర్భవతి అని తెలిసింది. విషయం తెలిసిన బాలిక తండ్రి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. తండ్రి అలా బెదిరించడంతో బాలిక ఆ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. 
 
గర్భం దాల్చటంతో ఇంటికే పరిమితమైన బాలికకు ఏడో నెలలో తీవ్రమైన నొప్పులు వచ్చాయి. బాలిక ఆస్పత్రిలో చేరిన తరువాత బాలిక ప్రాణాలకు ప్రమాదం ఉందని గుర్తించిన వైద్యులు బిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నించగా బాలిక మగబిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలిక తండ్రి టామె ఫౌబాను అరెస్ట్ చేశారు. కోరీ ప్రాంత ప్రజలు నిందితుడు టామె ఫౌబాను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: