తెలంగాణ రాజకీయ పార్టీలు మరో సమరానికి సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే  టీఆర్ఎస్ పార్టీకి 2019 బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చింది. గత 2019 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని సాధించిన గులాభి రంగు కారు పార్టీ అభ్యర్దులకు ఎంతగా బ్రేకులు వేసిన ఆగేలా లేవు. ఆ జోష్ లోనే 2020 లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో శుభారంభం ఇస్తుందని గట్టినమ్మకంతో ఉన్న కారుపార్టీ నాయకుల్లో ఉత్సాహం ఊహించని స్దాయిలో ఉందట. అయితే ప్రత్యర్ధి పార్టీ నుండి ముప్పులేకుండ చేసుకున్న కేసీయార్ కు ఇప్పుడు ఓ పెద్ద తలనొప్పి స్టార్ట్ అయ్యిందంట..

 

 

ఇక తెలంగాణాలో మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్‌కు తేది దగ్గర పడుతున్న కొద్ది టికెట్ ఆశించిన ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైందట.. ఇక అభ్యర్థులు అయితే ఆందోళన చెందు తున్నారని వినికిడి.. ఇలా ఎందుకంటే  ప్ర‌త్య‌ర్థి పార్టీల కంటే స్వంత వారితోనే టీఆర్ఎస్‌కు కష్టాలు ఎదుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయని తెలుస్తుంది. టీఆర్ఎస్ అధిష్ఠానంలో మొదలైన ఆందోళనకు కారణం రెబ‌ల్స్ బెడ‌ద మున్సిపోల్స్‌లో దెబ్బ‌తీస్తుందా అనే సందేహాలకు తావిస్తుందట.

 

 

ఇకపోతే ఇప్పుడు రెబ‌ల్స్ లేకుండా చూడాల్సిన బాధ్య‌త ఎమ్మెల్యేల‌పై పడింది. ఇప్పటికే ఎన్నిక‌లు జ‌రుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లోనూ టీఆర్ఎస్ పార్టీ నేత‌లు టిక్కెట్ల కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారట. ఇక‌, పార్టీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. అవేమంటే పార్టీని స్థాపించిన నాటి నుంచి టీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న‌ నేత‌లు ఒక వ‌ర్గంగా ఉండగా, టీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వ‌చ్చాక పార్టీ కండువా కప్పుకున్న వర్గం అంతా ఒకవైపు ఉన్నారట.

 

 

ఇప్పుడు టిక్కెట్ల విష‌యంలో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉందని తెలుస్తుంది. ఇదంతా ఇప్పుడు టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా త‌యారైంది. అందుకే టిక్కెట్ ద‌క్కని నేత‌ల‌ను బుజ్జ‌గించే బాధ్య‌త‌ను స్థానిక ఎమ్మెల్యేల‌కు అప్ప‌గించింది. ఎట్టి ప‌రిస్థితుల్లో రెబ‌ల్స్ బెడ‌ద లేకుండా చూడాల‌ని ఎమ్మెల్యేల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు అందాయట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: