అమరావతి ప్రాంతంలో అన్యాయం అక్రమం జరిగిపోతున్నట్లు ఆర్తనాదాలు పెడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అదే స్థాయిలో విమర్శలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏపీలో జనసేన కు బలం లేకపోయినా పవన్ మాత్రం తాను బలవంతుణ్ణి అన్నట్టుగా వ్యవహరిస్తూ అధికార పార్టీనీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతిలో పర్యటించిన పవన్ రోడ్డుపై బైఠాయించి మరి ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టాడు. అమరావతి రైతులకు తెలుగుదేశం ప్రభుత్వంలో అంతా మంచే జరిగినట్టు, వైసీపీ ప్రభుత్వం అలా జరగడం లేదు అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు. కానీ ఇంత హడావుడి చేస్తున్న పవన్ ఇప్పటికీ రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారు.

 

 మూడు రాజధానుల ఏర్పాటును తాను మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నాను అని కానీ వ్యతిరేకిస్తున్నాను అని ఎక్కడ చెప్పలేకపోతున్నారు. ఇలా చెబితే జరిగే నష్టం ఏమిటి అనేది పవన్ కు బాగా తెలుసు. అందుకే ఎక్కడ అ ఊసే ఎత్తకుండా అమరావతి లో రైతులకు మద్దతు ప్రకటిస్తున్నట్టు గా పవన్ ఇక్కడే తన రాజకీయం అంతా నడుపుతున్నడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు సూచనల మేరకే అమరావతిలో పవన్ పర్యటిస్తున్నారనే వ్యాఖ్యలు కూడా ఎక్కువవుతున్నాయి.

 

తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు వైసిపి ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అమరావతిలో రైతుల దీక్షకు మద్దతుగా పవన్ వన్ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఆయనను టిడిపి వెనక ఉండి నడిపిస్తున్నారు అంటూ  విజయ సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పెయిట్ ఆర్టిస్ట్ అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్విట్ ను విడుదల చేశారు విజయసాయి. పవన్ కళ్యాణ్ నటనా కౌశల్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అమరావతి రైతుల ముందు ఈ పారితోషకం ప్రదర్శన చూశాక తెలుగుదేశం అధినాయకత్వం నుంచి మరింత  రెమ్యునరేషన్‌ను పెంచుకునేందుకు అర్హుడని భావిస్తున్నాను. అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: