ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజలందరికీ మాకు ముఖ్యమంత్రి జగన్ అన్న ఉన్నాడు అనే ధీమా  కలిగిస్తూ సుపరిపాలన అందిస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన అందిస్తున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ అభివృద్ధికి ఎన్నో కీలక నిర్ణయలు  తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ ఉపయోగపడేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే వైయస్సార్ రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం చేయాలని నిర్ణయించింది. ప్రతి యేటా రైతులకు ఖాతాల్లో 13500 రూపాయలను జమ చేసేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న పంట పెట్టుబడి  నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. మూడు విడతలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిన్ఱయించింది.  కాగా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు  దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల పరిశీలన పూర్తి అయిపోయింది. ఇక నేటి నుంచి రైతు భరోసా తుది చెల్లింపులు మొదలు పెట్టేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 

 

 

 ఏకంగా రాష్ట్రంలోని 46.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. దీనికోసం 1082 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఇవాల్టి నుంచి తుది చెల్లింపులు చేపట్టేందుకు నిర్ణయించింది. గ్రామ సచివాలయంలో  రేపటి నుంచి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు అధికారులు . జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఎ  పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా రైతులందరికీ ఈ  నిర్ణయంతో జగన్ సర్కార్  శుభవార్త చెప్పినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: