గత కొంత కాలంగా నల్గొండ జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇళ్లలో, షాపుల్లో చోరీలు చేసిన దొంగలు ఇప్పుడు రూటు మార్చారు. ఏటీఎంలను టార్గెట్ చేస్తూ ఏటీఎంలను కొల్లగొట్టి నగదు దోచుకుంటున్నారు. గ్యాస్ కట్టర్, రాడ్ల సహాయంలో ఏటీఎంలను ధ్వంసం చేస్తూ సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి దొంగలు పని కానిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకొని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలొని నల్గొండ జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఒక ఏటీఎంనే ధ్వంసం చేశారు. చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు ఏటీఎంలోని డబ్బులను ఎత్తుకెళ్లారు. దొంగలు ఏటీఎం సెంటర్ లోని సీసీ కెమెరా వైర్లను కూడా కట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. 
 
గ్యాస్ కట్టర్ సహాయంలో సినీ ఫక్కీలో ఏటీఎం మిషన్ ను కట్ చేసి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఏటీఎం కేంద్రంలోనే ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు సీసీ కెమెరా వైర్లను కత్తరించి దొంగతనం చేయటంతో పోలీసులకు నిందితులను గుర్తించడం జఠిలంగా మారింది. 
 
గతంలో కూడా ఏటీఎం దొంగతనాలకు ప్రయత్నించిన కొందరు విఫలయత్నం చేసి పోలీసులకు పట్టుబడ్డారు. కానీ ఈ దొంగతనం చేసిన దొంగలు మాత్రం పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాంకు అధికారులు ఎంత డబ్బును దొంగలు దోచుకెళ్లారనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్థానికులే ఈ దొంగతనం చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: