ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి అసలు పాలన అంటే ఎలా ఉంటుందో నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచే లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో కీలక నిర్ణయాలు ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు ఇలా జగన్ పాలన దూసుకుపోతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్. 

 

 

 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఆరునెలల్లోనే ఎక్కువ మొత్తంలో నెరవేర్చి చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి... పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ... ప్రతి వర్గానికీ చేయూతనిచ్చేలా వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీంతో ప్రజల్లో  జగన్ అంటే ఒక ధీమా ఏర్పడింది. మాకు ఏ సమస్య వచ్చినా మా వెన్నంటే జగన్ అన్న ఉన్నాడు అనే ధీమాతో ఆంధ్ర ప్రజలందరూ ఉన్నారు. ఇకపోతే వివిధ సంక్షేమ పథకాల్లో  లబ్ధిదారుల 21.58 లక్షల మందికి పైగా అనర్హులు  ఉన్నారని వైయస్సార్ నవశకం  సర్వే తేల్చింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించిన ఈ సర్వేలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలలో ఎంతోమంది అనర్హులు ఉన్నారని తేలింది. 

 

 

కాగా మొత్తం గా ఉన్న అనర్హుల్లో  14.25 లక్షల మంది రేషన్ కార్డు దారులు ఉండడం గమనార్హం. వివిధ జిల్లాల వారీగా  వైఎస్ఆర్ నవశకం చేపట్టిన సర్వేలో... రేషన్ కార్డు దారులు, విద్యా దీవెన,  వైయస్సార్ పెన్షన్ కానుక లాంటి పథకాల నుంచి లబ్ధి పొందుతున్న వారిలో ఏకంగా.. 21, 58,375 మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సర్వేను పరిశీలించిన అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలు  హాట్ హాట్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్మోహన్రెడ్డి రాజధాని ప్రకటన చేసిన తర్వాత ఆంధ్ర రాజకీయాలల్లో  పెద్ద దుమారమే రేగింది. రాజధాని అంశం పైనే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  చర్చించుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: