టిక్ టాక్ నేటితరం యువత ను ఒక రేంజ్ లో ఊపేసిన యాప్. ప్రస్తుతం   ఆన్లైన్ లో ఎన్ని యాప్స్  ఉన్నప్పటికీ ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం టిక్ టాక్ యాప్ కి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. తక్కువ సమయంలోనే ఎంతోమంది నెటిజన్లను ఆకర్షించిన తెగ ఫేమస్ అయిపోయింది. ఎంతో మంది చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకూ టిక్ టాక్ ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. ఏకంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వాడే ఫేస్బుక్ వాట్సప్ లను  సైతం వెనక్కి నెట్టి ప్రస్తుతం ఆన్లైన్ లో దూసుకుపోతుంది టిక్ టాక్. నెటిజన్లు  టిక్ టాక్ వాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఇప్పటి వరకు రాని సరికొత్త ఫీచర్లు ఉండడంతో ఎక్కువ మంది టిక్ టాక్ వాడి ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. 

 

 

 టిక్ టాక్ లో  ఎంతోమంది వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంతోమంది పక్క వాళ్ళు చేసిన వీడియోలను చూసి ఎంటర్టైన్మెంట్ పొందే  వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు  ఇక టిక్ టాక్ వల్ల  చాలామంది ప్రమాదాల బారిన కూడా పడ్డారు. ఎందుకంటే ఎంత ట్రై చేసినా లైక్ లు రావడం లేదని భావించిన చాలామంది. టిక్ టాక్ లో లైక్ ల కోసం కొన్ని ప్రమాదకరమైన స్టెంట్స్  చేయడం వల్ల గాయాల పాలైన  వారు ఉన్నారు...  ఏకంగా ప్రాణాలు సైతం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంతే కాకుండా  టిక్ టాక్ ఎంతో మంది కాపురాల్లో చిచ్చు పెట్టి భార్యాభర్తలను విడదీసింది కూడా. అంతేకాదండోయ్ ఎంతో మంది టిక్ టాక్ ద్వారా తమ టాలెంట్ ను  నిరూపించుకోని  ఏకంగా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి సెలబ్రిటీలు కూడా మారిపోయారు. 

 

 

 ఇకపోతే  చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ని సైనికులు తమ అధికారిక ఫోన్లలో ఉపయోగించవద్దు అంటూ అమెరికా నేవీ ఉత్తర్వులు జారీ చేసింది. టిక్ టాక్ ఆప్ ని అడ్డుపెట్టుకొని సైనికులకు చైనా వల వేసే పలు రహస్యాలను తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని అనుమానంతో... అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని టిక్ టాక్ మాతృ సంస్థ మాత్రం ఖండించింది. టిక్టాక్ విషయంలో ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని టిక్ టాక్  మాతృసంస్థ... బైట్ డ్యాన్స్  తెలిపింది. అవసరమైతే తమ కంపెనీలను విదేశీ కంపెనీలకు అమ్మడానికి కూడా తాము సిద్ధమంటూ తెలిపింది టిక్టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: