ప్రతి వ్యక్తికి ధనవంతుడుగా మారాలనే కోరిక ఉడటం సహజం. 62 కళలకు సంబంధించి మన పూర్వీకులు అనుభవంతో ఎన్నో విషయాలు చెప్పినా ఆ కళలలో డబ్బు సంపాదన కూడ ఒక కళగా మన పూర్వీకులు గుర్తించలేదు. అయితే సమాజం విలువలు మారిపోయి డబ్బు ఉంటేనే మనిషికి విలువ అన్న భావన పెరిగి పోవడంతో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్లుగానే మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు.

గీత సారాన్ని భోదిస్తూ బౌతిక సుఖాలను తుచ్చమైన డబ్బు గురించి విరక్తి పెంచుకోమని మనకు జ్ఞానభోద చేసే స్వామీజీలు కూడ ప్రస్తుతం డబ్బు ప్రాధాన్యతను గుర్తించి తమ ట్రస్టుల ద్వారా వేల కోట్లకు అధిపతులుగా మారుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో అన్ని వ్యసనాలకంటే డబ్బు సంపాదన వ్యసనమే ప్రతి వ్యక్తిలోనూ కనిపిస్తోంది అంటూ ఒక సామాజిక శాస్త్రవేత్త ఈమధ్య కామెంట్ చేసాడు.    

ప్రస్తుతం చాలామంది డబ్బు సంపాదన లో పడి కాలాన్ని కుటుంబాన్ని సమాజాన్ని మరచిపోతున్నారు అన్న అభిప్రాయలు కూడ వ్యక్తం అవుతున్నాయి.  ఒకప్పుడు బ్రతకాలి అంటే డబ్బు ఉండేది కాదు  కేవలం వస్తు మార్పిడి విధానంలో జీవించే వారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో  జీవితం అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది. వాస్తవానికి చాలామంది డబ్బున్న వారు అంతా ఐశ్వర్య వంతులు అనుకుంటారు. అయితే ఐశ్వర్యం వేరు - సంపాదన వేరు. 

ఒక వ్యక్తి ధనవంతుడు కాకపోయినా జ్ఞానంలో చదువులో కళలలో సంస్కారంలో గొప్పవాడు అయితే ఆ వ్యక్తులను గతంలో ఐశ్వర్య వంతులుగానే చూసేవారు. అయితే విలువలు మారిపోవడంతో ఇప్పుడు ఏ రంగంలో అయినా ఆ వ్యక్తికి డబ్బు ఉన్నప్పుడు మాత్రమే గొప్పవాడుగా గుర్తిస్తున్నారు. అయితే డబ్బు లేకపోయినా జ్ఞాన సంపదను కూడ ఐశ్వర్యంగా గుర్తించిన సంస్కారం ఉన్న వాడికే అదృష్టం కలిగి ధనవంతుడు అవుతాడు. అంతేకాదు ఏ మనిషికైనా విలువలు ఉన్న వారు మాత్రమే జీవితంలో నిజంగా ధనవంతులుగా మారే ఆస్కారం ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: