సంక్షేమాల ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజల మన్నలను పొందుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2020 జనవరి మాసంలో బృహత్తరమైన పధకాల అమలుకు కార్యాచరణ రోపొందించినట్టు తెస్తుంది. ఈ విషయాన్నిఇప్పటికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఏపీ సర్కార్ ఆయా పధకాల అమలు దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే ఒక రూపాయి జమ చేసి.. తర్వాత వడ్డీ చెల్లింపులకు రంగం సిద్ధం చేస్తున్నారు. చివరికి లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ చెల్లింపులు జరగనున్నట్టు సమాచారం. డ్వాక్రా మహిళలు తీసుకున్న లోన్స్‌కు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ చెల్లించేందుకు సిద్దమైంది. 


సున్నా వడ్డీ పథకం..
డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ సందర్భంగా సీఎం వై ఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 4 విడతల్లో ఈ చెల్లింపులు జరుపనున్నారు. మొదట మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక రూపాయి జమ చేసి.. తర్వాత వడ్డీ వేయడం ప్రారంభిస్తారు. లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ చెల్లింపులు జరగనున్నాయి. తీసుకున్న రుణం సొమ్ము కట్టేలోపు 6 నెలలకోసారి ప్రభుత్వం వడ్డీ జమ చేయనుంది. వాస్తవానికి పాదయాత్రలో సీఎం జగన్ ఎం చెప్పారంటే.. డ్వాక్రా మహిళలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్యాంకులకు వెళ్లి.. అప్పు ఎంత ఉందో రశీదు తీసుకోండి. మా ప్రభుత్వం రాగానే ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. ఆ సొమ్ముతో ఏమైనా చేసుకోవచ్చు. బ్యాంకులకు వడ్డీ లెక్కలు కడతాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఆచరణలో పెడుతున్నారు.


వైఎస్ఆర్ ఆసరా..
ఇక జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామిలో భాగంగా.. 'వైఎస్ఆర్ ఆసరా' పథకం ద్వాకా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలను మొత్తం నాలుగు విడుతల్లో మాఫీ చేయనున్నారు. కాకపోతే లోన్ తీసుకున్న డ్వాక్రా సంఘాలు బకాయిలు కడుతూనే ఉండాలి. తర్వాత ఆ డబ్బులను ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: