ప్రస్తుతం ప్రతి ఒక్కరు టీవీ చూస్తున్నారనే విషయం తెలిసిందే. ఇకపోతే మనకి ఇష్టమైన ఛానల్ చూడాలంటే భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది నేటి రోజుల్లో. ఒకప్పుడు డిటిహెచ్ లో మాత్రమే ఎక్కువ ఛార్జీలను వసూలు చేసేవారు. దీంతో ఎక్కువమంది కేబుల్ ఆపరేటర్ల ను సంప్రదించి కేబుల్ కనెక్షన్ ద్వారానే సేవలు పొందే వారు. ఎందుకంటే కేబుల్ ద్వారా అతి తక్కువ ధరలకే ఎక్కువ చానల్స్ ని చూడొచ్చు అని నమ్మేవారు. కానీ గత సంవత్సరం ట్రాయ్  తీసుకున్న నిర్ణయాలతో కేబుల్ కనెక్షన్ కూడా సామాన్య ప్రజలకు భారంగానే మారిపోయింది, డిటిహెచ్ ల కంటే ఎక్కువగా కేబుల్ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో కేబుల్ కనెక్షన్ పెట్టుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీటీహెచ్లో వారు ఎక్కువగా వసూలు చేస్తున్నారని కేబుల్ కనెక్షన్ పెట్టుకుంటే కేబుల్ కనెక్షన్ నుంచి కూడా ఎక్కువ వసూలు చేస్తే... అధిక ఛార్జీలు చెల్లించేదెలా అంటూ కేబుల్ వినియోగదారులు అనుకుంటున్నారు. 

 

 

 ఏకంగా ప్రస్తుతం కేబుల్ వినియోగదారులు కూడా డీటిహెచ్ కు  చెల్లించినట్లు కేబుల్  చానల్స్ కి చెల్లిస్తున్నారు. అయితే డిటిహెచ్ ఏ ఛానల్   కావాలి అనుకుంటే ఆ  చానల్స్ కు మాత్రమే డబ్బులు చెల్లించాలి,  కానీ కేబుల్ సర్వీస్ లో మాత్రం ఫ్రీ టో ఎయిర్ కొన్ని చానల్స్ తర్వాత కాస్ట్ కట్టింగ్  మరి కొన్ని చానల్స్ అధిక వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మాకు ఇచ్చిన నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నామంటూ సమాధానం చెబుతున్నారు. ఏదేమైనా భారీగా పెరిగిపోయిన కేబుల్ ధరలతో మాత్రం వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పాలి. ఓవైపు డిటిహెచ్ పెట్టుకునే స్తోమత లేక    మరో వైపు కేబుల్ బిల్లు చెల్లించే డబ్బుల్లేక... ఇంకోవైపు టీవీలు చూడకుండా ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు.

 

 

 ఇకపోతే తాజాగా ట్రాయ్ కొన్ని నిబంధనలను సడలించింది. స్లాబ్ సిస్టమ్ ను  తొలగిస్తూ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం నూట ముప్పై రూపాయలకు 100 ఫ్రీ ఛానల్స్ ఇస్తుండగా... అదనంగా మరో 25 ఫ్రీ టు ఎయిర్   చానల్స్ కి 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విధించిన ఈ నిబంధనలను తాజాగా రద్దుచేస్తూ కేబుల్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది ట్రాయ్ . ఇక నుంచి రెండు వందల ఫ్రీ టు ఎయిర్  ఛానల్స్ కు  కేవలం 160 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ట్రాయ్  కొత్త నిబంధన ను తీసుకు వచ్చింది. ట్రాయ్  తీసుకువచ్చిన ఈ కొత్త  నిబంధనతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: