దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇటీవలే ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలో  భారీ  అగ్నిప్రమాదం జరిగి 44 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను మరవక ముందే తాజాగా మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. బాటరీ లీకవడంతోనే ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో భవనం మొత్తం కుప్పకూలిపోయింది. దీంతో సిబ్బంది మొత్తం భవన శిధిలాల కింద చిక్కుకున్నారు. ఢిల్లీలోని ఫీరగాడి  ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండగానే భారీ పేలుడు సంభవించి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 

 

 

 దీంతో భవనం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో పలువురు కార్మికులు రెస్క్యూ టీం సభ్యులు భవన  శిధిలాల కింద చిక్కుకున్నారు. బాధితులను వెలికి తీసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా బాధితులను కాపాడేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందం ఫైర్ బ్రీగ్రేడ్ చర్యలు చేపట్టింది. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు 35 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.స్థానిక  ప్రజలందరినీ పోలీసులు దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఇలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే పోలీసులు స్థానిక ప్రజలందరినీ దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

 

 

 ఈ భారీ అగ్నిప్రమాదంలో  భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత మందికి గాయాలయ్యాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఈ భవన శిధిలాల కింద ఎంత మంది కార్మికులు రెస్క్యూ టీం సభ్యులు ఉన్నారు అన్నది కూడా ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.ఇకపోతే ఢిల్లీ వాసులు అందరూ వరుస  అగ్నిప్రమాదాల తో బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ బతుకుతుంటే... మరో వైవు వరుస అగ్ని ప్రమాదాలతో  బెంబేలెత్తిపోతున్నారు ఢిల్లీ వాసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: