కేంద్రంలో, మరి కొన్ని రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బిజెపికి ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నాయకులు ఉన్నా...ఆ పార్టీ ఓట్ల శాతం మాత్రం ఇప్పటికి పెరిగే పరిస్థితి లేదు. మరో దశాబ్దం వరకైనా..ఆ పార్టీ పరిస్థితి ఇక్కడ అంతంత మాత్రమే. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎదిగిన ఆ పార్టీ ఇక్కడ ఎదగలేకపోవడానికి, కనీసం ఓట్ల శాతం పెంచుకోకపోవడానికి ఇక్కడ ఉన్న నాయకులే కారణమని చెప్పవచ్చు. ఓట్లు, సీట్లు, ప్రజాభిమానం లేని ఆ పార్టీ ఇక్కడ బోలెడు మంది నాయకులను పెంచిపోషిస్తోంది. అయితే ఈ నాయకులు తమ పార్టీ ఎదుగుదలకు కృషి చేయకుండా..రాష్ట్రంలోని ఇతర పార్టీలను బలోపేతం చేయడానికో...లేక బలహీనపర్చడానికో ప్రయత్నాలు చేస్తుంటారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపిని ఓడించడానికి ఆ పార్టీ నాయకులు వైకాపాతో చేతులు కలిపి హోరాహోరిగా పోరాడారు. ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినా...వైకాపా గెలుపుకోసమే ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. అంటే తాము గెలవకపోయినా..ఫర్వాలేదు..తమకు గిట్టని పార్టీల అంతు చూడడమే లక్ష్యంగా పనిచేశారు. అయితే ఎన్నికలయ్యాక కూడా...ఆ పార్టీ నాయకులు...రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల కొమ్ము కాయడానికే ప్రయత్నిస్తున్నారు. కొంత మంది ప్రస్తుత అధికార పార్టీకి పరోక్షంగా కొమ్ము కాస్తుంటే మరి కొందరు ప్రతిపక్ష టిడిపికి మద్దతు ఇస్తున్నారు. ఇక మూడవ వర్గానికి చెందిన వారు...మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో బిజెపి పార్టీ మూడు పార్టీలుగా అవతరించిందని చెప్పవచ్చు. మూడు గ్రూపులుగానో, మూడు వర్గాలుగానో ఉంటే ఫర్వాలేదు..కానీ ప్రజా సమస్యల విషయంలో కానీ, పార్టీ లైన్‌ విషయంలో కానీ ఈ మూడు వర్గాల మధ్య సంఘర్షణలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీగా ఒక లైన్‌కు కట్టుబడాల్సిన పార్టీ నాయకులు...తమ ఇష్టారాజ్యంగావ్యవహరిస్తూ..తమకు మేలు చేసే వారికి మద్దతు ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.

0.5శాతం ఓట్లు కూడా లేవు..
అఖండ భారతావనిని శాసిస్తున్న అధికార భారతీయ జనతాపార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 0.5శాతం ఓట్లు కూడా లేవు. గతంలో టిడిపితో పొత్తు పెట్టుకుని కొన్ని అసెంబ్లీ సీట్లు, మరికొన్ని పార్లమెంట్‌ సీట్లు గెలుచుకోవడం తప్ప..ఒంటరిగా ఆపార్టీ ఎప్పుడూ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓట్లు, సీట్లు లేకపోయినా...ఆ పార్టీకి నాయకులు మాత్రం భారీగానే ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బిజెపి అంటే ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఒక్కడి పేరే వినిపించేది. తరువాత కాలంలో కేంద్రంలో  బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత...ఆ పార్టీ ఆంధ్రా, తెలంగాణల్లో కొద్దిగా పుంజుకుందని చెప్పవచ్చు. తెలంగాణ సంగతేమో కానీ..ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ ఒక శాతం ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి. 

పెరిగే పరిస్థితి లేదు..
కేంద్రంలో, మరి కొన్ని రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బిజెపికి ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నాయకులు ఉన్నా...ఆ పార్టీ ఓట్ల శాతం మాత్రం ఇప్పటికి పెరిగే పరిస్థితి లేదు. మరో దశాబ్దం వరకైనా..ఆ పార్టీ పరిస్థితి ఇక్కడ అంతంత మాత్రమే. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎదిగిన ఆ పార్టీ ఇక్కడ ఎదగలేకపోవడానికి, కనీసం ఓట్ల శాతం పెంచుకోకపోవడానికి ఇక్కడ ఉన్న నాయకులే కారణమని చెప్పవచ్చు. ఓట్లు, సీట్లు, ప్రజాభిమానం లేని ఆ పార్టీ ఇక్కడ బోలెడు మంది నాయకులను పెంచిపోషిస్తోంది. అయితే ఈ నాయకులు తమ పార్టీ ఎదుగుదలకు కృషి చేయకుండా..రాష్ట్రంలోని ఇతర పార్టీలను బలోపేతం చేయడానికో...లేక బలహీనపర్చడానికో ప్రయత్నాలు చేస్తుంటారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపిని ఓడించడానికి ఆ పార్టీ నాయకులు వైకాపాతో చేతులు కలిపి హోరాహోరిగా పోరాడారు. ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినా...వైకాపా గెలుపుకోసమే ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. అంటే తాము గెలవకపోయినా..ఫర్వాలేదు..తమకు గిట్టని పార్టీల అంతు చూడడమే లక్ష్యంగా పనిచేశారు. అయితే ఎన్నికలయ్యాక కూడా...ఆ పార్టీ నాయకులు...రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల కొమ్ము కాయడానికే ప్రయత్నిస్తున్నారు. కొంత మంది ప్రస్తుత అధికార పార్టీకి పరోక్షంగా కొమ్ము కాస్తుంటే మరి కొందరు ప్రతిపక్ష టిడిపికి మద్దతు ఇస్తున్నారు. ఇక మూడవ వర్గానికి చెందిన వారు...మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో బిజెపి పార్టీ మూడు పార్టీలుగా అవతరించిందని చెప్పవచ్చు. మూడు గ్రూపులుగానో, మూడు వర్గాలుగానో ఉంటే ఫర్వాలేదు..కానీ ప్రజా సమస్యల విషయంలో కానీ, పార్టీ లైన్‌ విషయంలో కానీ ఈ మూడు వర్గాల మధ్య సంఘర్షణలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీగా ఒక లైన్‌కు కట్టుబడాల్సిన పార్టీ నాయకులు...తమ ఇష్టారాజ్యంగావ్యవహరిస్తూ..తమకు మేలు చేసే వారికి మద్దతు ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.

రాజధానిపై మూడు గ్రూపులు..
తాజాగా 'అమరావతి' రాజధాని తరలింపు విషయంలో ఈ మూడు గ్రూపులు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అధికార వైకాపాను సమర్థించే బిజెపి నాయకులు తరలింపు అనేది రాష్ట్ర ప్రభుత్వ విషయమని, దాన్ని సమర్థిస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. ఇలా వైకాపాను సమర్థించే వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది 'జి.వి.ఎల్‌. నర్సింహ్మారావు, సోమువీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి, విష్ణుకుమార్‌రాజు తదితరులు ఉన్నారు. ఇక టిడిపి లైన్‌లో మాట్లాడే వారిగా 'సుజనాచౌదరి, సిఎం రమేష్‌ తదితరులు ఉన్నారు. వీరు కాకుండా గతంలో కాంగ్రెస్‌ నుండి బిజెపిలో చేరిన వారిది తలోదారి. మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులు మాజీ ఎంపి హరిబాబు, తదితర నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో మౌనం వహిస్తున్నారు. వీరు దేనికి స్పందించడం లేదు. రాష్ట్రంలో ఏమి జరిగినా, పార్టీలో ఏది జరిగినా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న 'కన్నా లక్ష్మీనారాయణ' మాటలను వీరెవరూ వినే పరిస్థితుల్లో లేరు. ఆయన గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరారు. అంతే కాకుండా అప్పట్లో వైకాపాలోకి వెళ్లాలని అంతా రెడీ చేసుకుని.. ఆఖరు నిమిషంలో ఆగిపోయారు. దీంతో.. ఆయన పార్టీలో ఉన్నా.. పరాయివాడే అన్నట్లుగా పార్టీ సీనియర్‌ నాయకులు ఆయనను లక్ష్య పెట్టడం లేదు. ముఖ్యంగా జివిఎల్‌ పార్టీలో ఉన్న నాయకులందరికీ తానే లీడర్‌ అయినట్లు తనదే పార్టీలో ఆఖరి నిర్ణయమన్నట్లు వ్యవహరిస్తుండడం పార్టీలో విభేదాలకు, గందరగోళానికి కారణం అవుతోంది. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో మూడు బిజెపిలున్నాయని, వాటిలో ఒకటి వైకాపా బిజెపి, మరోటి టిడిపి బిజెపి, ఇంకోటి పాత బిజెపి అని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. ఆయా నాయకులు మాట్లాడుతుంటే...ఈయన వైకాపా బిజెపి నాయకుడు..ఫలానా ఆయన టిడిపి బిజెపి నాయకుడు అంటూ వారు పేర్లు పెట్టి.. ఎగతాళిగా వ్యాఖ్యానిస్తున్నారు. అఖండ భారతాన్ని తన కొనచూపుతో ఏలుతున్న 'మోడీ, అమిత్‌షా'ల దృష్టికి ఈవిషయాలు వెళుతున్నాయో..లేదో...వేచిచూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: