తాగుబోతుల చేష్టలకు ఒక అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మద్యం మత్తులో కళ్లుమూసుకుపోయి ఒకవైపు ఆడవారిపై అఘాయిత్యాలు చేస్తూ... మరొకవైపు ఎంతటివారిపైన ఘోరమైన నేరాలను చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విధులలో ఉన్నటువంటి ఒక ఎస్సైని మందుబాబులు ఓ కారుతో అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ఆ ఎస్ఐ కాలు విరిగింది.

 


వివరాల్లోకి పోతే.. నిన్న రాత్రి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకోవడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంలోనే ఎస్ఐ కృష్ణ ఒక కారుని ఆపి చేసి డ్రైవర్ ని చెక్ చేయాలని భావించి ముందుకు రాగా.. ఆ కారు అత్యంత వేగంగా వచ్చి అతడిని ఢీ కొట్టింది. కారు చాలా వేగంగా దూసుకు రావడంతో.. ఎస్సై యొక్క కాలు విరిగింది. అలాగే తన తలకు గాయాలవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. దాంతో అక్కడ ఉన్న మిగతా పోలీసులు అతనిని వెంటనే దగ్గరలోని ఒక ఆసుపత్రికి తరలించారు.

https://mobile.twitter.com/TelanganaDGP/status/1212582788270055424

అలాగే సంఘటనా స్థలం లోనే ఉన్న మిగతా ఇద్దరు పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని హైదరాబాద్ కి చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ గా గుర్తించారు. ఫోర్డ్ కారులో వెళ్తున్న ఈ నలుగురు పూటుగా మద్యం తాగి ఉన్నారని పోలీసులు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తరలించామని తెలిపారు. మద్యంతో పాటు ఈ నలుగురు డ్రగ్స్ ని కూడా తీసుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మితిమీరిన స్థాయిలో మద్యం తాగి వాహనాలు నడిపిన మూడు వేల మందిని ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర సందర్భంగా ఎప్పుడూ జరగని విధంగా చాలా మద్యం ఖర్చయిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: