దొంగతనాలు చేసే దొంగలు అప్పుడప్పుడు చేసే పనుల్లో తప్పులు దొర్లుతాయని మనకు తెలిసిందే. కాని వింతలు కూడా చోటు చేసుకుంటాయని ఇప్పుడు చూసే విషయంతో తెలిసిపోతుంది. ఇక చెడపకురా చెడేవు అనే సామేత ఉంది. ఈ సామేత అక్షరాల ఈ దొంగకు సూటవుతుంది. అంతే కాదు చూసిన వారికి దొంగతనం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసిపోతుంది.

 

 

ఒక్కోసారి దొంగతనానికని వెళ్లిన దొంగలు వారే ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దొంగతనం చేయాలంటే దైర్యంతో పాటుగా, మొండితనం ఉండాలి. కాని కొందరు దొంగతనానికైతే వెళ్లుతారు తీరా వెళ్లాక దైర్యంచాలక అడ్దంగా బుక్కైపోతారు. మరికొంత మంది దొంగలు చాలా శ్రమకోర్చి దోపిడీకున్న అడ్డంకులన్ని తొలగించుకుంటారు కానీ తీరా ఆక్కడికి వెళ్లాక పావలో పరకో కనిపించిన దోచుకుని వచ్చిందే చాలంటూ బ్రతుకు జీవుడా అని నిట్టూర్పు విడుస్తారు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు చూడబోయే దొంగ, దొంగతనానికి కొత్త కావచ్చూ. అసలు ట్రైనింగ్ తీసుకోకుండానే దోపిడికి బయలు దేరాడనే అనుమానం వస్తుంది.

 

 

ఎందుకంటే దోపిడి కోసమని ఇతను వేసుకున్న ప్లాన్ అతనికే బెడిసి కొట్టింది. అదేమంటే బస్సును దోచుకుందామని ఆశతో బస్సు అయితే ఎక్కాడు. ఇక కదులుతున్న బస్సులో ఉన్న ప్రయాణికులను భయపెట్టి దోచుకుందామని అనుకుని తన ఫ్యాంటులో పెట్టుకున్న గన్‌ను బయటకు తీయబోయి.. తనని తానే కాల్చేసుకుని గాయాల పాలు అయ్యాడు. ఈ ఘటన పశ్చిమ మెక్సికోలో చోటుచేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుంటే.

 

 

ఇద్దరు దొంగలు డిసెంబరు 27  బస్సు ఎక్కగా, అందులో ఉన్న ఓ దొంగ ప్రయాణికులను దోచుకునేందుకు తన ఫ్యాంట్‌లో దాచిపెట్టిన గన్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించాడు. కానీ అది ఫ్యాంట్‌కు చిక్కుకోవడం వల్ల వెంటనే బయటకు తీయలేక పోయాడు. ఇక దాన్ని తీసే క్రమంలో పొరపాటున ట్రిగర్‌ను తాకాడు. అంతే, పెద్ద శబ్దం చేస్తూ గన్ పేలింది. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. ఆ అరుపులు విన్న డ్రైవర్ వెంటనే బస్సు ఆపేశాడు. అంతలోనే బుల్లెట్ దెబ్బకు గాయపడిన దొంగ, అతడి సహచరుడు వెంటనే బస్సు దిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: