నూతన సంవత్సరం సందర్భంగా పలు చోట్ల ఎందరో మందుబాబులు రెచ్చిపోయారు. ఎందరో యాక్సిడెంట్లు చేసారు. ఎందరో యాక్సిడెంట్లకు గురయ్యారు. ఈ మందుబాబుల కారణంగా మరెందరో రోడ్డు పాలయ్యారు. ఈ ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకా న్యూ ఇయర్ రోజు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే పోలీసులు ఎక్కువ భద్రత ఏర్పాటు చేశారు.  

                                  

ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముగ్గురు విద్యార్థులు రోడ్డుపై హల్ చల్ చేశారు అని పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించారు. పోలీసుల దాష్టీకానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

 

ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి సిరిసిల్ల పట్టణంలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలో అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన రాహుల్, బన్నీ, శ్యాం అనే ముగ్గురు విద్యార్థులు బైక్‌పై వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు.. వీరిని బ్రీతింగ్‌ అనలైజర్‌తో చెక్‌ చేశారు. అనంతరం ఆ ముగ్గురిని ఎస్సై వద్దకు తీసుకెళ్లారు. ఆపై ఎస్సైతోపాటు పలువురు కానిస్టేబుళ్లు వారిని విచక్షణా రహితంగా కొట్టారు. 

 

అయితే అదే స్థలంలో అంతకుముందు ఇరు వర్గాల యువకులు ఘర్షణ పడగా పోలీసులు వారి గొడవను పంపేశారు. కానీ కాసేపటికే రాహుల్, బన్నీ, శ్యాం త్రిబుల్‌ రైడింగ్‌లో వచ్చి పోలీసులకు చిక్కారు. దీంతో అప్పటికే ఫైర్ ఉన్న పోలీసులు కాస్త వారిపై ఆలా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆ ఘటన వైరల్ అయ్యింది. అది కాస్త ఎస్పీ రాహుల్‌ హేగ్డే కంట పడటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ నలుగురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: