తప్పులు అందరూ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ తప్పులను సరిచేసుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం తాము చేసింది తప్పు అయినా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తమ వైపు తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఎదుటువారిపై నిందలు వేస్తూ చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. అటువంటి వారిలో ముందు ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తాజాగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. గూగుల్ లో జగన్ పేరు కొడితే ఖైదీ నెంబర్ 6093 అని వస్తోందని, ఈయన మనకు ముఖ్యమంత్రా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇటువంటి నేరగాళ్లు మనకు ముఖ్యమంత్రా అంటూ ప్రశ్నించారు. 


ఇపుడు అకస్మాత్తుగా జగన్ ఖైదీ అనే విషయాన్ని గుర్తు చేసేందుకు బాబు తెగ తాపత్రయపడిపోతుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే జగన్ పేరు గూగుల్ లో ఏమి వస్తుందో చెప్పిన బాబు తన కుమారుడు, రాజకీయ వారసుడు లోకేష్ పేరు గూగుల్ లో కొడితే పప్పు అని వస్తున్న విషయాన్ని బాబు మర్చిపోయినట్టు ఉన్నారు.  అసలు చంద్రబాబు కుమారుడు లోకేష్ గా కంటే పప్పు గానే బాగా పాపులర్ అయ్యారు. అంతెందుకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ రాంగోపాల్ వర్మ సినిమా తీయడం, అందులో పప్పులాంటి అబ్బాయి అంటూ లోకేష్ ను ఉద్దేశించి తీసిన పాట బాగా పాపులర్ అయిన సంగతి బాబు మర్చిపోతున్నారు. 


జగన్ కు ఏపీలో ఎదురులేకపోవడం, ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతుండడంతో బాబు లో ఎక్కడలేని కోపాన్ని కలిగిస్తోంది. తాము రాజకీయంగా బాగా వెనకబడిపోతున్నాము అనే భావనలో ఉన్న చంద్రబాబు అమరావతి ప్రాంతంలో రైతులను రెచ్చగొడుతూ  ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తూ ఆ చిచ్చులో చలి కలగాలని చూస్తున్నారు. అందుకే తన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని కూడా పక్కనపెట్టి మరీ ఇలా దిగజారి మరీ వ్యాఖ్యలు చేస్తుండడం విడ్డూరంగా కనిపిస్తోంది. అంతెందుకు గతంలో  ఎప్పుడూ తన భార్య భువనేశ్వరిని రాజకీయంగా ముందుకు తీసుకురాని బాబు ఇప్పుడు మాత్రం అమరావతి విషయంలో ఆమెను ముందు పెట్టి రాజకీయం నడిపిస్తుండడం, జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.

 

 రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయంలో చంద్రబాబు హుందాగా రాజకీయాలు నడిపించడం మానేసి గతంలో చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ మరింతగా దిగజారుతుండడం ఆయన మానసిక పరిస్థితిపై అందరిలోనూ ఆందోళన కలుగుతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: