తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా త్వరలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు అని అందరు చర్చించుకుంటున్న  విషయం తెలిసిందే. త్వరలో కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని ఆ పదవిని తన రాజకీయ వారసుడు సిరిసిల్ల ఎమ్మెల్యే ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు అప్పజెప్ప పోతున్నారని... వార్తలు వస్తున్నాయి. అటు టిఆర్ఎస్ వర్గాల్లో  కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై ఇన్ డైరెక్ట్ గా  కేటిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో  ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి. కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతాడా... ఒకవేళ కేటిఆర్ ముఖ్యమంత్రి అయితే కెసిఆర్ ఏం  పదవి చేపట్టబోతున్నారు అనే చర్చ మొదలైంది. 

 

 

 ఇకపోతే తాజాగా మంత్రి కేటీఆర్ గురించి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ రూరల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ లలాగా... ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అసమర్థుడు  కాదని ఆయన చెప్పుకొచ్చారు. 

 

 

 సీఎం పదవి చేపట్టడానికి కెసిఆర్ తనయుడు కేటీఆర్ కు అన్ని విధాల సమర్థుడని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్రం సాధించిన నెహ్రూ కుటుంబం దేశాన్ని పాలిస్తూ ముందుకు  నడిపింది అని  వ్యాఖ్యానించిన ఆయన... ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దు అంటూ ఆయన నిలదీశారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొంతకాలంగా కేటీఆర్ సీఎం కాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు ఎర్రబెల్లి దయాకర్ రావు తన వ్యాఖ్యలతో ఊతమిచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: