ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు  ఏర్పడే అవకాశం ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజధాని అధ్యయనం కోసం జగన్మోహన్రెడ్డి సర్కార్ నియమించిన కమిటీ కూడా జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ నివేదిక ఇవ్వడం తో... ప్రతిపక్ష పార్టీలన్నీ జగన్ సర్కార్ పై తీవ్ర  స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజదానుల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

 

 

 రాజధాని అమరావతిలో అయితే పరిస్థితి రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతోంది. రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి మారుస్తాము అంటే తనకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాజధాని రైతులు అందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు. దీంతో అమరావతి రాజధాని మొత్తం హాట్ హాట్ గా ఉంది. అంతేకాకుండా రాజధాని రైతులు అందరూ తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తున్నారు. దీంతో  రాజధాని ప్రాంతం మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

 

 

 ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాష్ట్ర రాజధానుల అంశంపై టీడీపీ నేత జవహార్  విమర్శలు చేశారు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని  నిర్లక్ష్యం చేయడం అంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను పట్టించుకోకపోవడం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం లోని భూముల అంశం గురించి ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే విశాఖలో 50 వేల ఎకరాలను ఆ పార్టీ నేతలు కొనుగోలు చేశారు అంటూ ఆరోపించారు టిడిపి నేత జవహర్. ఇక్కడ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: