31 డిసెంబర్ వచ్చిందంటే తాగడం తూగడం మాములైపోతుంది. ఎంతలా అంటే మళ్లీ కొత్త సంవత్సరం నుంచి తాగొద్దు  అంటూ నిర్ణయించుకొని కొత్త సంవత్సరంలో తాగేది మొత్తం ఒకే రోజు తాగేంతలా . ఎక్కడ చూసినా ఫుల్ కిక్ లో కనిపిస్తుంటారు. ఇకపోతే కొత్త సంవత్సరం మద్యం అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే 31 డిసెంబర్ అంటేనే మందు... మందు అంటేనే 31 డిసెంబర్ అనేలాగా ఉంటుంది. అబ్బో అది మామూలు తాగటమా సంవత్సరం  మొత్తం జరిగే అమ్మకాల ఒక్కరోజు మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తెలంగాణలో డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు ఓ రేంజ్ లో జరిగాయి. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే వచ్చింది . 

 

 

 ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ముఖ్య ఆదాయ వనరులు లిక్కర్ ముందువరుసలో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం షాపులకు రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి . మందు బాబుల   వేడుకలకు అయితే  అంతే లేకుండా పోయింది. మామూలుగానే 10 గంటల సమయానికి వైన్ షాపులు క్లోజ్ చేస్తేనే అప్పటికి ఫుల్లుగా తాగేస్తారు . అలాంటివి రాత్రి ఒంటిగంట వరకు మద్యం షాపులు ఓపెన్ ఉండడంతో ఇక మందుకు అద్దు అదుపు లేకుండా పోయింది. మందు బాబుల  వేడుకలకు అంతే లేకుండా పోయింది. ప్రభుత్వానికి కాసుల  వర్షం కూడా గుర్తించింది. 

 

 

 హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ల్లో  డిసెంబర్ 30 31 తేదీల్లో అత్యధిక స్థాయిలో దాదాపు మూడు వందల ఎనభై కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగాయని తెలుస్తోంది.. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం సాధారణ రోజుల్లో అయితే రోజుకు 60 కోట్లు మద్యం విక్రయాలు జరుగుతాయని సమాచారం. ఇటీవలే మాత్రం మద్యం ధరలను  10 శాతం మేర పెంచినప్పటికీ కూడా విక్రయాలపై మాత్రం ఈ ప్రభావం ఎక్కడ పడలేదు. అంతేకాకుండా తాగే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. పెంచిన ధరల పై మొత్తం 300 నుంచి 400 కోట్లు ఎక్సైజ్ శాఖకు అదనంగా ఆదాయం సమకూరింది. దీంతో 2019 20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వానికి 20 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: