తెలుగుదేశం పార్టీ ముందునుండి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఇందు మూలంగానే రాజధానికి ఏమాత్రం సహకరించని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చంద్రబాబు ప్రకటించడం జరిగిందని ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉంటారన్న ఆలోచనతో పాలు మాత్రమే బాగుపడాలి అన్నట్టుగా మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాన్య వర్గాల ప్రజల అభివృద్ధిని పక్కనపెట్టి కేవలము కమ్మ కులానికి మేలు చేకూరే విధంగా చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధాని గా ప్రకటించడం జరిగిందని చాలామంది అధికార పార్టీ నేతలు ఇటీవల కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

 

ఇదే తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాను కమ్మ కులానికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యత వహిస్తా..? నాకు అన్ని కులాలు సమానమే అని వైసిపి నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేయటం ఇటీవల మనం చూశాం. ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు కి కమ్మ కులం పై ఉన్న ప్రేమ ఒక్కసారిగా బయటపడింది ఒక చర్య వల్ల. విషయంలోకి వెళితే గన్నవరం నియోజకవర్గంలో కమ్మ కులానికి చెందిన వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేయడం జరిగింది.

 

అయినా గాని ఇప్పటివరకు ఆ నియోజకవర్గాన్ని మరో వ్యక్తిని చంద్రబాబు ఇన్‌ఛార్జ్‌గా పెట్ట‌లేదు. అయితే ఇదే తరుణంలో గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే గిరి ఇటీవల జగన్ ని కలవడంతో కలిసిన కొద్ది క్షణాల్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గిరి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడిని ఇన్‌ఛార్జ్‌గా నియమించడం జరిగింది. దీంతో మద్దాలి గిరి తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశాను. స్థానిక సమస్యలు వివరించాను.

 

సీఎం వెంటనే స్పందించి రూ. 25 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి దగ్గరకి ఎందుకు వెళ్లారని ఒక్కమాట కూడా అడగకుండా.. ఇంచార్జ్‌గా మరో వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏంటి?. ప్రజల కోసం సీఎం ని కలిస్తే తప్పేంటి? నా వివరణ కోరకుండా ఇంచార్జ్‌ని నిమించాల్సిన అవసరం ఏంటి?. వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎందుకు నియమించలేదు?. కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలో ఇంచార్జ్‌ని ఎందుకు నియమించలేదు?. ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నారు అంటూ చంద్రబాబు నాకు కుల పిచ్చి లేదు అని అంటూనే తన సామాజిక వర్గం పై ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు టిడిపి ఎమ్మెల్యే మద్దాలి గిరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: