ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సీఎం జగన్ పై తనకు ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన విషయం తెలిసిందే. "రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అన్న" అనే పాటను లయబద్ధంగా పాడుతూ చక్కటి హావభావాలు పలికించిన టిక్ టాక్ వీడియో తెగ వైరల్ అయింది. జగన్ ను ప్రశంసించేలా ఉన్న పాటకు డిప్యూటీ సీఎం టిక్ టాక్ వీడియో చేయటంపై వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేయగా నెటిజన్లు డిప్యూటీ సీఎం టిక్ టాక్ వీడియోలో అదరగొట్టారని ప్రశంసించారు. 
 
పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియోపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు. పరిపాలన చేయటం అంటే టిక్ టాక్ వీడియోలు చేయటం కాదని విమర్శలు గుప్పించారు. మంత్రి పుష్ప శ్రీవాణి సమస్యలు చెప్పుకోవటానికి ఆమె దగ్గరకు ఎవరైనా వస్తే వారికి మాత్రం అందుబాటులో ఉండరని అనురాధ ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన చేతి గాజును అమరావతి పరిరక్షణ సమితికి ఇవ్వటంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 
 
భువనేశ్వరిపై పుష్ప శ్రీవాణి చేసిన విమర్శలకు కూడా అనురాధ కౌంటర్ ఇచ్చారు. రాజధాని రైతుల దుస్థితిని చూసి భువనేశ్వరి చలించిపోయారని అందుకే తన చేతి గాజులను ఇచ్చారని అన్నారు. భువనేశ్వరిపై విమర్శలు చేయడం సరికాదని అనురాధ అన్నారు. రైతులు ఇన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే కనిపించటం లేదా...? అని అనురాధ ప్రశ్నించారు. 
 
వైసీపీ పార్టీ నేతలపై విమర్శలు చేసే అనురాధ చంద్రబాబు గారి భజన మాత్రం ఆపటం లేదని ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అనురాధ ప్రెస్ మీట్లలో ఎప్పుడూ చంద్రబాబు భజనే చేస్తూ ఉంటారని బాబోరి భజన బోరు కొట్టలేదా...? అని ఇతర పార్టీల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై అనురాధ చేసిన విమర్శలకు నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: