తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేంద్ర అధికార పార్టీ బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాల్లో బలమైన పార్టీగా బీజేపీని తీర్చిదిద్దెందుకు చూస్తోంది. అయితే బీజేపీకి అనుకున్నంత స్థాయిలో అది సాధ్యపడడంలేదు. అయినా హడావుడి చేస్తూనే వలస నాయకుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అదిగో ఆ నాయకుడు వస్తునందు ఇదిగో ఈ నాయకుడు వస్తున్నాడు అంటూ హడావుడి చేయడం నాయకులు ఎవరూ చేరకుండా ఉండడం ఇవన్నీ తెలంగాణ బీజేపీ నాయకుల్లో అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ అధికార పార్టీ బీజేపీ బలంగా ఉండడంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులంతా ఆ పార్టీలోకే క్యూ కట్టారు తప్ప బీజేపీ వైపు చూసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. 


ఈ నేపథ్యంలో కొత్త రకమైన ఎత్తుగడలతో ముందుకు వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.టీఆర్ఎస్ లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి జ్వాలలు మొదలవ్వడంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ లో చాలా మంది నాయకులు అసంతృప్తి తో ఉండడంతో వారిని మెల్లిగా బీజేపీ వైపు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీఆర్ఎస్ లో ప్రాధాన్యత కోల్పోయామని భావిస్తున్నవారు, పార్టీలో కొనసాగినా భవిష్యత్తులో తమకు అవకాశాలు పార్టీ ఇవ్వదు అనే నమ్మకానికి వచ్చేసినవారిని బీజేపీ టార్గెట్ చేసుకుంది.


 ఈ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముందుగా ప్రయోగించే పనిలో బీజేపీ ఉంది. అక్కడ టీఆర్ఎస్ అసంతృప్తులు ఎక్కువగా ఉండడంతో అక్కడ నుంచి టీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవడం మొదలుపెడితే మిగిలిన ప్రాంతాల నాయకుల్లో కూడా మంచి ఊపు వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి
 అటు టీఆర్ఎస్ లో చేరలేక రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్న నాయకులను కూడా గుర్తించి వారికీ పార్టీలో సముచిత స్థానం ఇస్తామంటూ ఆశలు పెడుతోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బలమైన పార్టీగా అవతరించి తెలంగాణ అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే ఆశలతో ఉంది టీఆర్ఎస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: