మూడు రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సీఎం జగన్ ను ప్రశంసిస్తూ చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అన్న పాటకు పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియోపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియోలో అదరగొట్టారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
తాజాగా వైసీపీ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొత్త సంవత్సరం వేడుకలకు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన డ్యాన్సింగ్ టాలెంట్ తో ఎంపీ అదరగొట్టారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానిక కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎంపీ ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఒంగోలులో ఎంపీ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు జరగగా తన డ్యాన్సింగ్ టాలెంట్ తో వైసీపీ ఎంపీ అదరగొట్టారు. 
 
ఈ వేడుకలకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. కార్యకర్తలు ఎంపీ వేదికపైకి వచ్చిన సమయంలో డ్యాన్స్ చేయాలని ఒత్తిడి చేయటంతో ఎంపీ డ్యాన్స్ చేశారు. ఎంపీ తాను కుర్రాళ్లకు పోటీ ఇస్తాను అనే విధంగా తన డ్యాన్స్ తో అదరగొట్టారు. హీరో మహేష్ బాబు పాటకు ఎంపీతో కలిసి అందరూ సరదాగా స్టెప్పులేశారు. అభిమానులు, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఎంపీ ఉత్సాహపరిచారు. 
 
సోషల్ మీడియాలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఎంపీ డ్యాన్స్ అదగగొట్టారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంపీ తన డ్యాన్స్ తో కార్యకర్తలలో జోష్ నింపడంతో పాటు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలోని వచ్చాడయ్యో స్వామి పాటకు ఎంపీ డ్యాన్స్ ఇరగదీశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: