జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల  ప్రకటించినప్పటి నుంచి అమరావతిలో రైతులందరూ నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. తీవ్రస్థాయిలో ఆందోళనలు ధర్నాలు చేపడుతూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నారు అమరావతి రైతులు  వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి లో రైతులు నిరసనకు  టిడిపి జనసేన పార్టీలు  మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. అమరావతి లో రైతులు నిరసన కు మద్దతు తెలుపుతూ జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ జనసేన నేతలు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా అమరావతిలో జరుగుతున్న రైతుల నిరసన కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

 

 

 అంతేకాకుండా అమరావతి రైతులకు మద్దతు తెలిపూతూ... అమరావతి రైతుల కోసం తన చేతి గాజులను కూడా విరాళంగా ఇచ్చారు నారా భువనేశ్వరి. అయితే  రైతుల కోసం తన చేతికి గాజులను  విరాళంగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తిరుపై  ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ విమర్శనాస్త్రాలు సందించారు. అమరావతి రైతుల కోసం తన చేతి గాజులు ఇచ్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కి రైతుల మీద ప్రేమ..?  లేక అమరావతి భూములపై ప్రేమ.?  అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఎప్పుడూ లేనిది అమరావతి రైతుల మీద సడన్గా ఇంత ప్రేమ ఎలా వచ్చింది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

 

 

 గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు  సరైన మద్దతు ధర లేక ప్రభుత్వం పట్టించుకోక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని చనిపోతే... ఈనాడు అమరావతి రైతులకు తన చేతి గాజులు ఇచ్చిన భువనేశ్వరీకి...  ఆనాడు ఎందుకు జాలి కలగలేదు అంటూ ఆరోపించారు. పుష్కరాల్లో 30మంది చనిపోయినప్పటికీ కూడా భువనేశ్వరికి జాలి కలగలేదని... రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అమరావతికి కొంచెం అయినా బాధ కలగలేదని విమర్శించారు అంబటి కాదు. కానీ ఇప్పుడు మాత్రం తన చేతి గాజులు ఇస్తుంటే  తమకు జాలి కలుగుతుంది అంటూ ఎద్దేవా చేశారు. నేడు  మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: