సినిమాల్లో నటిస్తే ఆయన్ను పెద్ద హీరో అన్నారు. మంచి పనులకు ముందుకు వస్తే మనసున్న మంచివాడు అన్నారు. కాని ఇప్పుడు రాజకీయాల్లో ఆయనచేసేదంతా నటన అసలు ఆయనకు నటించడమే రాదు అంటున్నారు. ఆయన నటించే ఒక్కో సినిమాకు ఆయన పేరు మరింతగా పెరిగిపోయింది. కానీ రాజకీయాల్లోకి వచ్చాకా ఆ పేరు కాస్త మారిపోయిందని అంటున్నారు.

 

 

సినిమా జీవితం వేరు రాజకీయ జీవితం వేరు. ఇంతలా చెప్పుకుంటున్న ఆయన ఎవరనేగా మీడౌటు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వెండితెరపై ఎందరో అభిమానులను ఉర్రూతలూగించిన పవన్ రాజకీయ జీవితంలో మాత్రం నవ్వులపాలవుతున్నారని ఆయన అభిమానులు బాధ పడుతున్నారట. ఎందుకంటే జనసేన పార్టీ మొదలు పెట్టినప్పుడు అదోక ఉప్పెనలా ఉరకలు వేసిందట. కాని ఇప్పుడు చూసుకుంటే ఆ ఉప్పెన పిల్లకాలువలా మారి ఎటుపయణించాలో తెలియక ఉన్న చోటే ఇంకిపోతుందని అనుకుంటున్నారు.

 

 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మాటల యుద్ధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్షాల నాయకులపై అధికారపక్షంలో ఉన్న నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు సరికొత్త రాజకీయానికి తన భార్యతో తెర తీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..

 

 

అమాయకులైన రైతులను పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారని, అభం శుభం తెలియని రైతులకు అధికారపక్షం చేస్తున్న మంచి పనుల గురించి తెలియ జేయకుండా కేవలం సమస్యల గురించి మాత్రమే తెలియజేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

 

 

ఇంతే కాకుండా పవన్ కళ్యాణ్ న్ను ఉద్దేశించి ఆయన సినిమాల్లో గబ్బర్ సింగ్ కావచ్చూ కానీ రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ఇదేకాకుండా ప్రజలకి ఎవడు ఎలాంటి వారో తెలుసని వారు అంతా గమనిస్తున్నారని అనవసరంగా ఎవరికి ఎవరు చెప్పనవసరం లేదని మండి పడ్డారు. అయితే ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత ఎలా స్పందిస్తారో చూడాలని కొందరు ఆసక్తితో ఎదురు చూస్తున్నారట...

మరింత సమాచారం తెలుసుకోండి: