వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేశామని అన్నారు. 13 జిల్లాల ప్రజలు కలిసి ఉండాలని మన అమరావతి రాజధాని మనతోనే ఉండాలని అన్నారు. అన్నాదమ్ములుగా విశాఖ, అమరావతి, కర్నూలుతో బాధ్యతలు పంచుకోవాలని అనుకుంటున్నామని విడిపోవాలని మాత్రం తాము అనుకోవటం లేదని చెప్పారు. 
 
చంద్రబాబు రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందో ముందే నిర్ణయించుకున్నారని ఆ తరువాత చంద్రబాబు తాను భూములు కొనటమే కాకుండా తన అనుచరుల చేత కూడా భూములు కొనిపించారని చెప్పారు. ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ అతి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారని అన్నారు. అమరావతికి 1,10,000 కోట్లు కావాలని చంద్రబాబు అన్నారని నారాయణ కమిటీ పేరుతో చంద్రబాబు తను చేయాల్సింది చేశారని అన్నారు. 
 
అమరావతికి కేంద్రం నుండి 1500 కోట్లు వచ్చాయని కానీ 53,000 కోట్ల పనులకు చంద్రబాబు టెండర్లు పిలిచి తన అస్మదీయులకు పనులు అప్పజెప్పారని అన్నారు. 5 సంవత్సరాలలో చంద్రబాబు కేవలం 5,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని అన్నారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరిగిందని చంద్రబాబు రెండు నాలుకల ధోరణి చూడండని అన్నారు. భూములు చంద్రబాబే కొన్నాడని రైతులకు అన్యాయం చేసిన చంద్రబాబే రైతులకు అన్యాయం జరిగిందని అంటున్నారని అన్నారు. 
 
ఎక్కడైనా రాజధాని కోసం భూములు కావాలి కానీ భూముల కోసం రాజధాని అవసరం లేదని ప్రకాష్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నారని డబ్బులు లేకుండానే కాంట్రాక్టర్లు పని చేస్తారా...? అని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తాను శిక్షను అనుభవించాల్సి వస్తుందని చంద్రబాబు రైతులను రెచ్చగొడుతూ రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించే ఉన్మాదిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయటానికి కృషి చేస్తోందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: