ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది జనాలు ఇంకెంతో మంది మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి.మరి  జనవరి 3వ తేదీన చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

 

 ఆరు సిక్సుల రికార్డ్ : 18 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రవిశాస్త్రి... కుడి చేతితో బ్యాటింగ్ ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ చేయగలడు. 1985 సంవత్సరంలో జనవరి 3వ తేదీన ఆరు బాళ్లలో  ఆరు ఆరు సిక్సర్లు కొట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా రికార్డు సాధించాడు రవి శాస్త్రి . ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రవిశాస్త్రి రికార్డు సృష్టించాడు. రవిశాస్త్రి క్రికెట్ కు  వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ కామెంటేటర్ గా మారిపోయాడు. ఎన్నో మ్యాచ్ లకు  తన  స్టైల్లో క్రికెట్ కామెంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు రవి శాస్త్రి . ప్రస్తుతం టీమిండియా కోచ్ గా కొనసాగుతున్నారు. 

 

 

 గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా : ఆనాటి సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2003 సంవత్సరంలో గవర్నర్గా సూర్జిత్ సింగ్ బర్నాలా నియమితులయ్యారు. సుర్జిత్  సింగ్ బర్నాలా పంజాబ్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. పంజాబ్ కి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ కి 2003 లో గవర్నర్ గా  నియమితులయ్యారు. 

 

 

 సావిత్రిబాయి పూలే జననం : భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత సావిత్రిబాయి పూలే 1931 జనవరి 3వ తేదీన జన్మించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే. కుల మత భేదాలు లకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని సావిత్రిబాయి పూలే. ఆధునిక విద్య ద్వారానే స్త్రీలకు విముక్తి లభిస్తుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. కాగా  సావిత్రిబాయి పూలే జయంతి భారతీయులందరూ జరుపుకుంటారు. ఇప్పటికీ ఆమె బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని నెమరువేసుకుంటారు  భారతీయులు. 

 

 

 సతీష్ ధావన్ మరణం : భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్ సతీష్ ధావన్. భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్ గా భారత అంతరిక్ష సంస్థ లో  ఎన్నో సేవలు అందించారు సతీష్ ధావన్. అంతేకాకుండా సతీష్ ధావన్  భారత ఎక్స్పెరిమెంటల్ డైనమిక్ పితామహుడిగా కూడా పరిగణిస్తారు. శ్రీనగర్ లో జన్మించిన సతీష్ ధావన్ భారత్-అమెరికా రెండూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ప్రముఖ పరిశోధకుడు ఒకరిలా పేరుగాంచారు. ఈయన  2002 జనవరి 3వ తేదీన మరణించారు. సతీష్ ధావన్  ఇస్రో ఇస్రో చైర్మన్ గా కూడా పని చేశారు.

 

 

 మహిళా టీచర్స్ డే : ఈరోజు దేశవ్యాప్తంగా మహిళా టీచర్స్ ని  జరుపుకుంటారు టీచర్ వృత్తిలో ఉన్న మహిళలు. మహిళల అభ్యున్నతి ని గుర్తు చేసుకుంటూ నేడు మహిళా టీచర్స్ డే ని జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: