అమరావతి రాజధాని భూముల విషయంలో వైసిపి పార్టీ నేతలు వేసిన ఆరోపణలు మరియు విమర్శలు తిప్పికొట్టడం విషయంలో చంద్రబాబు చాలా ఆలస్యం అవ్వటం జరిగిందని కానీ వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ చేసిన ఆరోపణలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పోయారని ఇందువల్లనే 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో కూడా చంద్రబాబు పార్టీ సరైన స్థానాల్లో గెలవలేక పోయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మేటర్ లోకి వెళితే అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు రాజధానిగా గుర్తించడం వెనుకాల చాలా పెద్ద స్కెచ్ ఉందని కేవలం తన కమ్మ సామాజిక వర్గం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో ఆడుకుని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి అసైన్డ్ భూములను ఈ ప్రాంతంలో మిగతా సామాజిక వర్గాలకు చెందిన భూములను తన వర్గం వారితో ముందుగానే కొనిపించి చంద్రబాబు తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగిందని..

 

ఈ విషయాన్ని వైసిపి పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే చాలా బలంగా ఏపీ ప్రజల్లోకి తీసుకు వెళ్లడం జరిగిందని కానీ జరిగిన ప్రచారాన్ని ఎక్కడా కూడా చంద్రబాబు ఆ సమయంలో ఖండించకుండా తాజాగా ఇప్పుడు బయటకు వచ్చి తన సామాజిక వర్గం కోసం నేను పని చేశాను అని జగన్ చేసిన కామెంట్ లపై స్పందించడం పట్ల కేవలం కమ్మ కులానికి టిడిపి అన్నట్టు చేస్తున్న వ్యాఖ్యల పట్ల తిప్పికొట్టడం లో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు..

 

చంద్రబాబు చాలా లేట్ అయ్యారని ఇప్పుడు బయటకు వచ్చి తన సామాజిక వర్గం గురించి తనకి అధికార పార్టీ నేతలు అంటగడుతున్నా కులం రంగు గురించి మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కేవలం అమరావతి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చంద్రబాబు కమ్మ కులం కోసం గుర్తించడం జరిగింది అన్న భావన లో బలంగా ఉండిపోయారు ఇందువల్లనే వైయస్ జగన్ రాజధాని గురించి కొత్తగా తెరపైకి తెచ్చిన మూడు రోజులు విషయంలో కూడా ఎక్కడా కూడా రాష్ట్రంలో వ్యతిరేకత రాలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: