ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని అభివృద్ధి ఒకేచోట ఆగిపోకుండా ఉండాలి అంటే  3 రాజధానిల  నిర్మాణం చేపట్టాలి అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై రాజధాని రైతులందరూ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రైతులు రైతు కుటుంబం మొత్తం రోడ్ల పైకి చేరి ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు తెలుపుతున్నారు.రైతులందరూ  రాజధాని అమరావతి నుంచి తొలగించే ప్రసక్తే లేదని... వెంటనే జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం తాము పంట పండించుకొనే  భూములను త్యాగం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి నుంచి తరలిస్తామని తమకు అన్యాయం చేస్తోన్నారంటూ  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమరావతి. 

 

 

 ఇకపోతే అమరావతి లో  రైతులందరూ చేపడుతున్న నిరసన దీక్షకు టిడిపి జనసేన పార్టీ ల మద్దతు ప్రకటిస్తూ విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆయన సతీమణి భువనేశ్వరి కూడా రైతుల నిరసన దీక్షలకు మద్దతు పలుకుతూ ఏకంగా ఆమె చేతి గాజులు సైతం విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి నేతలందరూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ అమరావతి రైతుల మీద ఎందుకు పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఇక తాజాగా వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

 

 గతంలో చంద్రబాబు హయాంలో 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. టిడిపి నేతలు రియల్టర్ అమరావతి లో ఎస్సీ ఎస్టీ రైతుల నుండి  అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారు... నిన్న జరిగిన అప్పుడు పంపించండి గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసింది ఉంది అంటే అది భూసేకరణ కుంభకోణం ఇన్సైడర్ ట్రేడింగ్ గ్రాఫిక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు  విజయసాయిరెడ్డి . దీని పై వ్యాఖ్యలు చేస్తే ధైర్యం చంద్రబాబునాయుడు కు  ఉందా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: