తాడికొండ నియోజకవర్గంలో వైసిపి పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన  ఎమ్మెల్యే శ్రీదేవిని  మొదటి నుంచి ఏదో ఒక వివాదం ఆమె చుట్టుముడుతూనే ఉంది . ఆమె  చేసిన వ్యాఖ్యలతో ఎన్నో వివాదాలు ఆమె చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ప్రజల ఆగ్రహానికి గురైంది తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి. ఎమ్మెల్యే పదవి చేపట్టినప్పటి నుంచి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె తీరు ఎన్నో వివాదాలకు  కేరాఫ్ అడ్రస్ గా  మారుతోంది. గతంలో వినాయక విగ్రహాల విషయంలోనూ ఓ వివాదం తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చుట్టుముట్టునది . ఇక ఆ తర్వాత చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని తో గొడవపడి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

 

 

 

 అంతేకాకుండా బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తో  ఏర్పడిన గొడవ కూడా అప్పట్లో ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఎప్పుడు స్థానిక వైసీపీ క్యాడర్ తో కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి. దీంతో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కూరుకుపోతూనే ఉంది ఎమ్మెల్యే శ్రీదేవి . ఇక తాజాగా ఈ ఎమ్మెల్యే చుట్టూ మరో వివాదం చుట్టుముట్టింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేస్తున్న సమయంలో .. ఈ విగ్రహం అంబేద్కర్ దేనా  అంటూ అక్కడున్న వారిని ప్రశ్నించడంతో అక్కడున్న వారందరూ కంగుతిన్నారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న శ్రీదేవి గారికి కనీసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా తెలియదా అంటూ విమర్శలు గుప్పించారు. 

 

 

 

 ఇదిలా ఉంటే.. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని అమరావతిలో రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించేందుకు నిరాకరించారు ఆమె . ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శనలో  తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించాలి అంటూ మీడియా ప్రతినిధులు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కోరగా... రాజధాని రైతుల గురించి అయితే మీడియాతో మాట్లాడను అంటూ సమాధానం ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీదేవి   అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ను రక్షించండి అని ఉన్న పోస్టర్ ను  కూడా ఆమె పక్కకు నెట్టేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి తీరు వివాదాస్పదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: