పౌరసత్వ సవరణ చట్టం భారతదేశ ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టిన రోజే చెప్పారు. షా చెప్పింది అక్షరాలా నిజమే. అందేందుకు, సాక్షాత్తు ముస్లిం వాళ్లే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము CAAకు పూర్తి మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం నేను ఒప్పుకోను అని గొంతు చించుకొని అరుస్తున్నాయి. శరణార్థులు మాత్రం.. పాకిస్తాన్ చూపించిన మత హింసకు మేము నరకం అనుభవించాం. CAAకు వ్యతిరేకులైన సెక్యూలర్ పార్టీ నాయకులు ఒక నెల రోజుల పాటు పాకిస్తాన్ లో ఉండి మీ నిర్ణయం చెప్పండని కంట తడి పెట్టుకుంటున్నారు.


వారి బాధలను అర్ధం చేసుకున్న నరేంద్ర మోదీ పాపం మన భారతదేశాన్ని నమ్ముకొని వచ్చిన ఈ శరణార్థులకు పౌరసత్వం ఇచ్చి స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పిద్దామని మంచి ఆలోచనతోనే caa ప్రవేశపెట్టారు. అయితే, పార్లిమెంట్ లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన తరువాత..వచ్చిన మార్పులేంటంటే.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ముస్లిమేతర శరణార్థులకు caa భారత పౌరసత్వాన్ని అందిస్తుందని. అయితే ఆ వలసదారులు డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చివుండాల్సి ఉంటుంది.




అయితే, 2000వ సంవత్సరంలో 8 మంది హిందువులు పాకిస్తాన్ లోని సింధ్ జిల్లాలో మత హింసకు గురై తట్టుకోలేక పారిపోయి భారతదేశానికి వలస వచ్చేసారు. అలా వచ్చిన వీళ్ళు గత 20 సంవత్సరాలుగా రాజస్థాన్ లోని కోటాలో తలదాచుకుంటున్నారు. అయితే, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందుకే భాజపా ప్రవేశపెట్టిన CAAకు వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అతడు ఆ ట్వీట్ చేసిన వారం రోజుల తరువాత వారి రాష్ట్రంలోనే ఉంటున్న 8 మంది ముస్లిమేతరులకు caa భారత పౌరసత్వాన్ని అందించింది. అయితే, caa మంజూరు అయిన తరువాత మొట్టమొదటిగా పౌరసత్వం పొందింది వేరే. అది కూడా కాంగ్రెస్ పార్టీ పాలన లో ఉన్న రాష్ట్రంలో..!!


అమిత్ షా ఏం చెప్పారంటే.. మీరు ఎక్కడున్నా..పౌరసత్వం కావాలనుకుంటే జస్ట్ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి చాలు అని అన్నారు. అమిత్ షా మాటలనే పాటించారు వీళ్ళు. దాంతో.. కోటా జిల్లా కలెక్టర్ ఓం ప్రకాష్ కసేరా పౌరసత్వం సర్టిఫికేట్లను మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు వింటే కసేరా జాబ్ ఊడిపోయిద్ది. అందుకే కేంద్ర సర్కార్ చెప్పినదానికి గౌరవమిస్తూ... శరణార్థులకు సర్టిఫికెట్స్ ఇచ్చాడు అతను.


ఏదేమైనా.. 'భారతదేశం తన పౌరసత్వాన్ని మాకు ఇచ్చినందుకు మేము ధన్యవాదములు. భారతీయ రాజ్యాంగం ప్రకారం పౌరులుగా ఇప్పుడు మా జీవితాలను గడపగలగడం మాకు సంతోషంగా ఉంది.' అంటూ ఉపశమనం పొందారు వాళ్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: