అధికారంలోకి వచ్చింది మొద‌లుకొని...సంక్షేమం-అభివృద్ధిలో సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ పాల‌న‌కు సుపరిచిత చిరునామాగా ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మారిన సంగ‌తి తెలిసిందే. అధికారం చేప‌ట్టిన నాటి నుంచే....పాలనపై సీఎం జగన్ తనదైన ముద్ర వేశారు. కీలక నిర్ణయాలను ఎలాంటి సంకోచం లేకుండా ఆయ‌న‌ తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో వైసీపీ అధినేత‌ సామాజిక సమతుల్యత పాటించారు. అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలను కల్పించి యువతకు  ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భరోసా ఇచ్చారు. దీంతోపాటుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చట్టం చేశారు. దీనికి కొనసాగింపుగా తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మ‌రిన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు.

 

కీల‌క‌మైన ఇసుక, మద్యం అక్రమ రవాణ కట్టడికి ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్య‌ నిర్ణ‌యం తీసుకుంది. అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించనుంది. ఇందుకోసం స్పెషల్ పోలీసు ఆఫీసర్ల నియామకానికి అర్హతలు ఖరారు చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సైనికోద్యోగులు, రిటైర్డ్ పారా మిలటరీ సిబ్బందికి  ప్రత్యేక అధికారులుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ పోలీసు అధికారులు, మాజీ  హోంగార్డులు, ప్రస్తుతం శిక్షణలో ఉన్న హోంగార్డులను తీసుకోనుంది. అభ్యర్థుల ఎంపిక‌లో భాగంగా ఎలిజిబులిటీ టెస్టులు నిర్వహించనున్నారు. తద్వారా కొత్త ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ద‌క్క‌నున్నాయి.

 

మ‌రోవైపు, ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు అనే సంచ‌ల‌నం నిర్ణ‌యం ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం ఏదైనా పరిశ్రమ ఏపీలో స్థాపించినట్టయితే అందులో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. సదరు సంస్థ మొదట ప్రభుత్వానికి వివరాలను అందిస్తే, ప్రభుత్వం తన స్వంత ఖర్చుతో నైపుణ్య అభివృద్ధి శిక్షణను అందిస్తుంది.ఈ బిల్లు దేశంలో సంచలనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: